సాక్షి, సిద్దిపేట: ప్రజాస్వామ్యంలో ఓటు విలువ కీలమైనది. నాయకుడిని ఎన్నుకునేందుకు అత్యధిక సంఖ్యలో ఓటర్ల భాగస్వామ్యం ఉండాలని భావించిన జిల్లా అధికారులు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఓటరు అవగాహన కార్యక్రమాలు మంచి ఫలితాలను ఇచ్చాయి. ఓటింగ్ శాతం పెంచేందుకు పడిన కష్టానికి ఫలితంగా జిల్లా వ్యాప్తంగా సిద్దిపేట, గజ్వేల్, హుస్నాబాద్, దుబ్బాక నియోజకవర్గాల పరిధిలో వృద్ధులు, మహిళలకు అత్యధిక సంఖ్యలో వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. దీంతో గతం కన్నా ఈసారి జిల్లాలో పోలింగ్‌శాతం పెరిగింది.
ఉదయం నుంచే బారులుదీరిన ఓటర్లు
తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు జిల్లాలోని ఓటర్లు ఉదయం నుంచే పోలింగ్ స్టేషన్ల వద్ద బారులుదీరారు. ఉదయం అయితే ఎవరూ ఉండరనే ఆలోచనతో కొందరు.., ఓటు వేసి తమ పనులకు వెళ్లేందుకు కొందరు పోలింగ్ స్టేషన్ల బాటపట్టారు. దీంతో దుబ్బాక, గజ్వేల్, సిద్దిపేట నియోజకవర్గాల్లో ఉదయం 9గంటల వరకే వేగంగా పోలింగ్ నమోదైంది. అయితే హుస్నాబాద్‌లో మాత్రం మందకొడిగా మొదలైంది. అదేవిధంగా ఉదయం 11గంటలకు మూడు నియోకవర్గాల్లో అదేవేగంతో పోలింగ్ సరళి నడవగా.. హుస్నాబాద్‌లో మాత్రం అంతంత మాత్రంగానే సాగింది. అయితే మధ్యాహ్నం వరకు మందకొడిగా సాగిన పోలింగ్ చివరికి 81 శాతం నమోదైంది.
పోలింగ్ సరళి ఇలా.. (శాతంలో..)
నియోజకవర్గం 9 గంటలకు 11గంటలకు 1గంటలకు 3 గంటలకు 5గంటలకు
సిద్దిపేట 12 31 50 67.5 78.86
హుస్నాబాద్ 06 24 41 61 83.17
దుబ్బాక 11 30 49 65.85 85.92
గజ్వేల్ 14 26 42 61 88
సగటు 11 28 46 64 83.98
Comments
Please login to add a commentAdd a comment