ఓటు వేస్తున్న దృశ్యం
సాక్షి, జనగామ: ఎలక్షన్ కమిషన్ నిబంధనల్లో ఎన్నో సంగతులు ఉన్నాయి. ఎన్నికల ప్రకటన వెలువడిన నాటి నుంచి పోలింగ్.. లెక్కింపు వరకు సామాన్యులకు చాలా వరకు తెలియదు. అభ్యర్థుల కదలికలను సూక్ష్మంగా చూసే ఈసీ.. ఓటు హక్కు దుర్వినియోగం చేస్తే అంతే కఠినంగా వ్యవహరిస్తుంది. పోలింగ్ రోజున ప్రతి ఓటరు క్యూలో నిలబడి ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన స్లిప్‌తో ఓటు వేస్తారు. పోలింగ్ కేంద్రానికి ఓటు వేసేందుకు వచ్చే లోపే మన ఓటు ఎవరైనా వేసినా మన ఓటును సద్వినియోగం చేసుకునేందుకు అవకాశం ఉంది. అంతేగాక తాను వేసిన ఓటు ఇతరులకు Ððవెళ్లిందని తెలిస్తే.. తన ఓటు తనకు నచ్చిన అభ్యర్థికి పడాల్సిందేనంటూ మరోసారి వేయడానికి కూడా అవకాశం ఉంది. అతను ఓటరు కాదని, ఎవరైనా వాదిస్తే అది తప్పు అని నిరూపించుకుని ఓటు వేసే హక్కు కూడా ఉంది. పోస్టల్ బ్యాలెట్ విధానమే అందరికీ తెలిసింది. కానీ మరో మూడు పద్ధతుల్లో కూడా ఓటు వేయడానికి అవకాశం ఉంది.
మొదటగా వేసే ఓటు ఏజెంట్లదే...
పోలింగ్ రోజున ఎన్నికల అధికారులు ముందుగా నమూనా ఓట్లతో పోలింగ్‌ను ప్రారంభిస్తారు. ఓటింగ్ ప్రారంభం కావడానికి గంట ముందు ఈ విధానాన్ని మొదలు పెడతారు. పోలింగ్‌లో అన్ని పార్టీల ఏజెంట్లు కలిసి 50 ఓట్లు వేస్తారు. వాటి లెక్కింపును పూర్తి చేసిన వెంటనే ఏజెంట్ల సమక్షంలోనే వాటిని మిషన్ నుంచి తొలగిస్తారు. నమూనా ఓట్లను ప్రింట్ తీసి సీల్డ్ కవర్‌లో భద్రపరుస్తారు. అనంతరం యథావిధిగా పోలింగ్ ప్రారంభిస్తారు.
చాలెంజ్ ఓటరు వివరాల నమోదు..
ఓటు వేయడానికి Ðవెళ్లిన వ్యక్తిని అసలు అతడు నిజమైన ఓటరు కాదని బూత్‌లో ఉన్న ఏజెంట్లు అభ్యంతరం చెబితే ఎన్నికల అధికారి అక్కడికక్కడే అతడిని ఓటు వేయకుండా నిలిపివేస్తాడు. ఆ సమయంలో ఛాలెంజ్ ఓటు అనుమతిస్తుంది. అక్కడే ఉన్న ప్రిసైడింగ్ అధికారి ఓటరుతోపాటు ఏజెంటు అభ్యంతరాలను విన్న తర్వాత అక్కడ క్యూలో ఉన్న ఓటర్లతో విచారణ జరుపుతారు. అక్కడ ఆయన నిజమైన ఓటరు అని తేలితే అతడికి ఓటు వేయడానికి అనుమతి లభిస్తుంది. నిజమైన ఓటరు కాదని తేలితే నిబంధనల మేరకు అతడిపై చర్యలు ఉంటాయి. చాలెంజ్ ఓటరు వివరాలను వెంటనే అక్కడికక్కడే నమోదు చేస్తారు.
టెస్టింగ్ ఓట్లు..
తన ఓటు తాను కోరుకున్న అభ్యర్థికి కాకుండా మరో అభ్యర్థికి నమోదైనట్లు వీవీ ప్యాట్ స్లిప్పులో వివరాలు వచ్చిన వెంటనే ఫిర్యాదు చేయడానికి అవకాశం ఉంది. అంతేగాక అక్కడికక్కడే పోలింగ్‌ను కూడా నిలిపివేయడానికి అవకాశం ఉంది. దానిపై రాతపూర్వకంగా ఫిర్యాదు చేస్తే ఏజెంటు సమక్షంలో విచారణ చేపడుతారు. ఓటరు చేసిన ఆరోపణ నిజమైతే వెంటనే పోలింగ్‌ను నిలిపివేస్తారు. ఆరోపణ తప్పని తేలితే అతడిపై ఎలక్షన్ కమిషన్ నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటారు.
క్యూలో ఓటర్ల సమక్షంలో విచారణ
ఓటరు తాను ఓటు వేయడానికి కంటే ముందే మరో వ్యక్తి అతడి ఓటు వేసిన నేపథ్యంలో అతడు టెంటర్డు పద్ధతిలో వేయడానికి అవకాశం కల్పిస్తారు. వచ్చిన వ్యక్తి నిజమైన ఓటరు అని ఏజెంట్లతో విచారణ చేసినప్పుడు నిర్ధారణ అయితే అతడికి బ్యాలెట్ పత్రాన్ని అందజేసి ఓటు వేయడానికి అనుమతిస్తారు. ఆ విధంగా వేసిన ఓటును భద్రపరుస్తారు. అభ్యర్థుల మధ్య ఓట్లు సమానంగా వచ్చిన సమయంలో టెండర్డు ఓటును పరిగణనలోకి తీసుకుంటారు.
Comments
Please login to add a commentAdd a comment