
మేడారంలో ఘనంగా తిరుగువారం
మేడారం, కన్నెపల్లి ఆలయూల వద్ద తిరుగువారం పండుగను బుధవారం వైభవంగా నిర్వహించారు. దీంతో మహాజాతర పూజా కార్యక్రమాల తంతు ముగి సింది.
ఎస్‌ఎస్ తాడ్వాయి: మేడారం, కన్నెపల్లి ఆలయూల వద్ద తిరుగువారం పండుగను బుధవారం వైభవంగా నిర్వహించారు. దీంతో మహాజాతర పూజా కార్యక్రమాల తంతు ముగిసింది. ప్రధాన పూజారి కొక్కెర కృష్ణయ్య, పూజారుల సం ఘం అధ్యక్షుడు సిద్దబోయిన జగ్గారావు, పూజారులు సిద్దబోయిన ముణేందర్, సిద్దబోయిన లక్ష్మణ్‌రావు, మల్లెల ముత్తయ్య గుడిని శుద్ధి చేశారు. అనంతరం ఆడపడుచులు సమ్మక్క శక్తిపీఠం గద్దెను మట్టితో అలికి ముగ్గులు వేశారు. తరువాత ప్రధాన పూజారి కొక్కెర కృష్ణయ్య అమ్మవారి వస్త్రాలను, పూజా సామగ్రి శుద్ధి చేసి, ధూప, దీపాలు, యూటను బలి ఇచ్చి నైవేద్యం సమర్పించారు. కన్నెపల్లి సారలమ్మ గుడి వద్ద కూడా పూజారులు కాక సారయ్య, కాక కిరణ్ తిరుగువారం పండుగ నిర్వహించారు. పగిడిద్దరాజు ఆలయంలో తిరుగువారం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు.