
కర్షక యజ్ఞం
జన్నారం: వరుణుడు ముఖం చాటేశాడు.. కళ్ల ముందే పంటలు ఎండిపోతుండడంతో వాటిని రక్షించుకోవడానికి అన్నదాతలు నాటా పాట్లు పడుతున్నారు. ఆదిలాబాద్ జిల్లా జన్నారం మండలం కవ్వాల్, కొత్తపేట్, దేవునిగూడ, కామన్‌పల్లి, కిష్టాపూర్ ప్రాంతాల్లో రైతులు వేసిన నారు మడి ఎండిపోతోంది. దీంతో దేవునిగూడకు చెందిన రైతులు పోకల పోశన్న, ముత్యం పోశన్న, తిరుపతి సుమారు అర కిలోమీటరు దూరం నుంచి కుటుంబ సభ్యులతో కలసి ఇలా బిందెలతో నీరు తెచ్చి నారును బతికించే ప్రయత్నం చేస్తున్నారు.