వక్ఫ్ భూములు దక్కేనా? | wax History of the land? | Sakshi
Sakshi News home page

వక్ఫ్ భూములు దక్కేనా?

Published Fri, Jun 27 2014 12:08 AM | Last Updated on Sat, Sep 2 2017 9:26 AM

వక్ఫ్ భూములు దక్కేనా?

వక్ఫ్ భూములు దక్కేనా?

జిల్లాలో అన్యాక్రాంతమైన వక్ఫ్‌భూములపై నూతన సర్కార్ సమర శంఖం పూరించింది. కబ్జాకు గురైన వేలాది ఎకరాల భూములను తిరిగి స్వాధీనం చేసుకునేందుకు మంత్రి హరీష్‌రావు ప్రత్యేక చొరవ చూపుతుండటంతో జిల్లా ముస్లింలలో ఆశలు చిగురిస్తున్నాయి.
 
 66 ఏళ్ల చరిత్రలోనే తొలిసారిగా శుక్రవారం ఈ విషయంపై మంత్రి సమీక్ష నిర్వహించనున్నారు. ఇదిలా ఉంటే అసలు వక్ఫ్ భూములెన్ని? కబ్జాకోరల్లో ఉన్నవి ఎన్ని?  వంటి వివరాలను కనుక్కునేందుకు ‘సాక్షి’ గురువారం జిల్లా వ్యాప్తంగా  స్పెషల్ డ్రైవ్‌చేపట్టింది. అన్ని ఎమ్మార్వో కార్యాలయాలు, మసీదు, దర్గా కమిటీల నుంచి సమాచారం సేకరించింది. సుమారు 30 వేల ఎకరాలకు గాను కేవలం 3,575 ఎకరాలకే రికార్డులు ఉండటం గమనార్హం.     
 
 రాజుల సొమ్ము రాళ్ల పాలయ్యింది. మొగలాయిలు, నిజాం నవాబులు దర్గా, మసీదులకు ఇనాం ఇచ్చిన ఆస్తులు అక్రమార్కుల చెరల్లో బందీ అయ్యాయి. జిల్లాలో 30 వేల ఎకరాలకు రికార్డుల్లో మిగిలింది 3 వేల ఎకరాలే. అందులో 1000 ఎకరాలు కూడా కబ్జా కోరల్లో చిక్కుకుంది. ఈ విషయం తెలిసినా గత పాలకులు పట్టించుకోలేదు. వ్యవహారం కాస్త తెనెతుట్టెలా మారింది. దీంతో దానిని తట్టాలంటేనే జంకారు అధికారులు. అయితే కొత్తరాష్ట్రంలో మంత్రి హరీష్ దీని సంగతేంటో చూద్దామని యుద్ధనాథంతో ముందుకొచ్చారు. దీనిపై శుక్రవారం సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. ఈ విషయం తెలియడంతో తమ భూములు తమకు దక్కుతాయన్న ఆశ ముస్లింల్లో చిగురిస్తోంది.
 
 సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: ముస్లిం పాలకులు వేలకు వేల ఎకరాల భూమిని దర్గా, మసీదులకు ఇనాంగా ఇచ్చారు. ఇమాం, సదర్‌ల నుంచి సేకరించిన వివరాల ప్రకారం ఆరోజుల్లో  30 వేల ఎకరాలు వక్ఫ్ భూములు ఉన్నట్టు అంచనా. ఇనాం భూముల ఆదాయంతో ఉర్సులు, ఉత్సవాలతో దర్గాలు జోరుమీదుండేది. ఇప్పుడా జోరు లేదు. దర్గా, మసీదుల ఆస్తులు కబ్జా కోరల్లో పడి కరిగిపోయాయి. రికార్డులు మాయమయ్యాయి. మసీదుల నిర్వాహణ కూడా భారమైపోతోంది. తాజా రెవిన్యూ రికార్డుల్లో 30 వేల ఎకరాల వక్ఫ్ భూములకు జాడే లేదు. అయితే ఈ విషయంపై ఆసక్తికర విషయాలను వెలుగులోకి తెచ్చింది. జిల్లా వ్యాప్తంగా  ఏ ఒక్క రెవిన్యూ కార్యాలయంలో వక్ఫ్ భూముల పై స్పష్టమైన సమాచారం లేదు. సరైన రికార్డులు లేవు. 30 వేల ఎకరాలకు కేవలం 3575 ఎకరాలకు మాత్రం రికార్డులు ఉన్నాయి. ఈ భూముల్లో కూడా దాదాపు 1000 ఎకరాలు కబ్జా అయ్యింది. మరి కొంత భూమిపై కోర్టులో కేసులు నడుస్తున్నాయి. ఎలాంటి కేసులు లేకుండా వక్ఫ్ బోర్డు ఆధీనంలో ఉన్నది కేవలం కొద్ది భూమి మాత్రమే.
 
 ‘ఆందోల్’నకరంలో...
 అందోలు నియోజకవర్గం పరిధిలోని 218.58 ఎకరాలుం ది. అందోలు గ్రామంలో సర్వే నం  1123, 180లలో 2.22 ఎకరాలు, 828, 596, 1114లలో 6.37 ఎకరాలు అషీర్ ఖానా, షోహీ అషీర్ ఖానా ఆధీనంలో ఉన్నాయి. సర్వే నం 460లో 0.36 ఎకరాలు అషీర్‌ఖానా, గ్రేవ్ యార్డులున్నాయి.
 
 సర్వే నం 121లో 0.15ఎకరాలు (అషీర్‌ఖానా), స ర్వే నం 1120లో 2.17ఎకరాలు ఖైరాతీ ఇనాం), సర్వే నం 1106లో 12.27 ఎకరాల(ఖైరాతీఇనాం), సర్వే నం 126లో 0.11ఎకరాలు (కిచన్‌షెడ్ మహబూబ్‌సుబానీ) వక్ఫ్ బోర్డు ఆధీనంలోనే ఉన్నాయి. సర్వే నం. 66లో 10.04 ఎకరాలు అన్నాసాగర్ దర్గా (మహ్మద్ హుస్సేన్) ఆధీనంలో,  సర్వే నం  56,281275,360లలో 5.21 ఎకరాలు చిల్లామహబూబ్ సుభానీ ఆధీనంలో, సర్వే నం 453లో 0.11 ఎకరాలు దర్గాపీరా ఆధీనంలో ఉన్నాయి. తాడ్మన్నూర్‌లో చిల్లా మర్సూబ్ సుభానీ ఆధీనంలో సర్వే నం 24,25, 266లలో 12.17 ఎకరాలు,  డాకూర్‌లోని సర్వే నం 954, 956,30ల లో 7.05 ఎకరాలు అషీర్‌ఖాన్ ఆధీనంలో ఉన్నాయి.
 
 చింతకుంటలోని సర్వే నం 436, 608లలో 1.14 ఎకరాలు అషీర్‌ఖాన్ ఆధీనంలో, సాయిబాన్‌పేటలోని సర్వే నం 91,283, 337లలో5.29 ఎకరాలు  అషీర్‌ఖాన్ ఆధీనంలో ఉన్నాయి. పోసానిపేటలోని చిల్లా బందేనవాజ్ ఆదీనంలో సర్వే నం 401లలో 0.16 ఎకరాలు ఉంది. అషీర్‌ఖాన్ ఆధీనంలో సర్వే నం 435,464,369, 7.26 ఎకరాలు, మన్‌సాన్‌పల్లిలోని సర్వేనంః 42,134లలో 0.21,013 ఎకరాలు ఉన్నా యి. కన్‌సాన్‌పల్లిలోని చిల్లా మౌళాలి ఆధీనంలో సర్వే నం 125, 140, 188, 194, 420, 109 లలో 0.24, 1.05 ఎకరాలున్నాయి. ఎర్రారంలోని ఇనాం ల్యాండ్స్ అండర్ చిల్లా దస్తగిరి ఆధీనంలో సర్వేనం 305లో 0.05 ఎకరాలున్నాయి.
 
 
 శేరి మల్లారెడ్డిపల్లిలోని చిల్లే మహబూబ్ సుభాన్ ఆధీనంలో సర్వే నం 160, 252లలో 1.12, 0.12 ఎకరాలున్నా యి. రాంసానిపల్లిలోని అషీర్‌ఖాన్ ఆధీనంలో సర్వే నం 118, 635, 636లలో 0.36 ఎకరాలు, అల్మాయిపేటలోని సర్వే నం 160, 161, 225, 532లలో రూ.5.18,0.33 ఎకరాలున్నాయి. చోటీ మజీద్ ఆధీనంలో సర్వే నం 326, 184, 185, 277, 278, 325లలో 15.33 ఎకరాలు, మసీద్ ఆదీనంలో సర్వే నం 66970, 279, 280, 665, 666లలో 27 ఎకరాలున్నాయి. చిల్లాదస్తగిరి ఆధీనంలో సర్వే నం 231, 567లలో 1.30 ఎకరాలలో ఎక్కువ భాగం కబ్జాకు గురైంది. ముసాఫిర్ ఖాన్ ఆధీనంలో సర్వే నం 475, 121, 122, 475, 536, 521లలో మొత్తం 45.29 ఎకరాల భూమి ఉంది. కౌరోతి ఇనాంగా సర్వే నం 65,667లలో 9.09 ఎకరాలు ఉన్నా భూమి మాత్రం కనిపించడం లేదు.
 
 సంగుపేటలోని అషీర్‌ఖాన్ ఆధీనంలో సర్వేనం 178, 254లలో 0.08, 0.15 ఎకరాలు, పోతిరెడ్డిపల్లిలో సర్వే నం 224లో 0.05 ఎకరాలు, టేక్మాల్ మండలంలో సర్వే నం 45లో 9.14 ఎకరాలు, 46లో 4.24 ఎకరాలు, 47లో  5.27 ఎకరాలు, 812లో 18 గుంటలు మొత్తం 20.03 ఎకరాలు ప్రభుత్వ ఆధీనంలోనే ఉన్నాయి. రేగోడ్ మండలంలో 2 ఎకరాలు ఉంది. అది స్మశానవాటికకు కేటాయించారు. రాయికోడ్ మండలంలో 3.37 ఎకరాలు ఉంది. సర్వే నం 107లో మహబూబ్ సుభానీ దర్గా ఆధీనంలో ఉంది.
 
 నారాయణఖేడ్‌లో నాకేశారు
 నియోజకవర్గం పరిధిలో 521.7 ఎకరాల భూములుండగా కంగ్టి మండలంలోని గర్డెగాం గ్రామంలోనే వక్ఫ్‌బోర్డుకు సంబంధించిన స్థిర ఆస్తులు వివాదంలో ఉన్నాయి. 18 ఏళ్ల నుంచి కోర్టులో కేసు నడుస్తోంది. గర్డెగాం శివారులోని సర్వే నెం. 11లో మొత్తం 19 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఈ భూమిని గ్రామానికి చెందిన బీసీ లబ్దిదారులు మొత్తం 14 మందికి 1996లో ఇనాం భూముల కింద పంపిణీ చేశారు. అయితే కల్హేర్ మండలం ఖాజాపూర్‌కు చెందిన హైదర్ పటేల్ అనే ముస్లిం మత పెద్ద ఆ భూములు తమ వక్ఫ్ బోర్డుకు చెందినదే అంటూ కోర్టులో దావా వేశారు. పట్టణం నడిబొడ్డున ఉన్న వక్ఫ్ భూములు అన్యాక్రాంతమవుతున్నాయి.
 
 సర్వే నెంబర్ 14లో 24.17 ఎకరాల భూముల్లో సగం వరకు అక్రమార్కుల చేతిలోకి వెళ్లింది. ఖేడ్‌లోని మన్సూర్‌పూర్ శివారులో సర్వే నెంబర్ 14లో ఉన్న 19.13 ఎకరాల వక్ఫ్ భూములు ఖాజా, హదిరి ఇనాం పేరిట ఉన్నాయి. హంగిర్గ(కె) పరిధిలోని నాగాపూర్ శివారులో ఉన్న సర్వే నెం 3/1, 3/2లో  15.28 ఎకరాల వక్ఫ్ భూములు ఖదీర్, మౌళ్‌సాబ్ ఆధ్వర్యంలో కౌలుకు ఇచ్చి సాగు చేస్తున్నారు. శల్గిరలో 106 సర్వే నెంబర్ 24.09 ఎకరాల వక్ఫ్ భూములు అన్యాక్రాంతమయ్యాయి.
 
 సిద్దిపేటలో..
 నియోజకవర్గంలో 95.5ఎకరాలు ఉండగా పట్టణంలోని 1471, 1476 సర్వే నంబర్‌లో గల 2.09 ఎకరాల భూమిపై కోర్టులో కేసు నడుస్తుంది. మండలంలో గల 15గ్రామాల్లో దాదాపు 10 గ్రామాల్లో 12.31ఎకరాలు వక్ఫ్ భూమి ఖబ్జాకు గురయ్యాయి. చిన్నకోడూరు మండలం పెద్దకోడూరులో సర్వే నెంబర్ 01లో 1.10ఎకరాలు, రామంచలో సర్వేనెంబర్ 208, 209లలో 1.20ఎకరాలు, గంగాపూర్‌లో సర్వేనెంబర్ 316లో 0.37గుంటలు, కస్తూరిపల్లిలో సర్వేనెంబర్ 137, 265లలో ఎకరం మొత్తం 4.27ఎకరాలు భద్రంగా ఉన్నాయి. నంగునూ రు మండలంలో నంగునూరు, పాలమాకుల, రాజగోపాల్‌పేట, నాగరాజుపల్లి గ్రామాల్లో 19ఎకరాలు ప్రభుత్వం ఆధీనంలో ఉంది.
 
 నర్సాపూర్‌లో నలిపెశారు...
 నియోజకవర్గంలో మొత్తం 564 ఎకరాలుండగా నర్సాపూర్ పట్టణంలో జామామజీద్, అశుర్‌ఖాన్, అబుసాబ్‌దర్గా, గ్రే వ్‌యార్డు, మదీన మజీదు తదితర వాటి పేర మీద 45 ఎకరాల భూములు ఉన్నాయి. ఇందులో సుమారు 15 ఎకరాలు కబ్జాకు గురయ్యాయి. పట్టణంలోని బస్టాండు సమీపంలో, మెయిన్‌రోడ్డుకు ఇరువైపుల ఉన్న ఎంతో విలువైన భూములను బోర్డుకు తెలియకుండా నర్సాపూర్‌కుచ చెంది న పలువురు వ్యక్తులు అమ్మడంతో అందులో భవనాలు, షాపింగ్ కాంప్లెక్స్‌లు వెలిశాయి.
 
 1999లో వక్ఫ్‌బోర్డు స్పందించి అక్రమంగా కొనుగోలు చేసి భవనాలు,షాపింగ్ కాంప్లెక్స్‌లు నిర్మించిన సుమారు 20మందికి నోటీసులు ఇవ్వడంతో కేసు కొనసాగుతుతంది. మిగిలిన సుమారు 30 ఎకరాల భూములు కౌలుకు ఇవ్వడంతో కొందరు రైతులు వ్యవసాయం చేస్తున్నారు. శివ్వంపేట మండలం శభాష్‌పల్లిలో 40ఎకరాలు, శివ్వంపేటలో 18ఎకరాలు, సికింద్లాపూర్‌లో 40ఎకరాలు, అల్లీపూర్‌లో 16ఎకరాల భూములు, నవాబుపేటలో 30ఎకరాల భూములు వక్ఫ్‌బోర్డుకు ఉన్నాయి. సికింద్లాపూర్ సుమారు 10 ఎకరాల భూములు, నవాబుపేటలో 5ఎకరాల భూములు ఆక్రమణలకు గురయ్యాయి.
 
 జహీరాబాద్‌లో 71.74 ఎకరాలేనటా....
 జహీరాబాద్ నియోజకవర్గంలో 71.74 ఎకరాలున్నాయి. జహీరాబాద్ పట్టణంలోని గడి మహెలాలో గల తకియా కిద్మతి కింద 218 సర్వే నెం.218లో 4.30 ఎకరాల భూమి ఉంది. ఇది తకియా కమిటీ పర్యవేక్షణలో ఉంది. స.నెం 211/ఎ లో 4.27 ఎకరాల భూమి మొల్ల కిద్మత్ ఉంది. ఇది మొల్ల కిద్మత్ కమిటీ ఆధ్వర్యంలో పరిరక్షిస్తోంది. స.నెం 139/1లో పోలీసు స్టేషన్ వెనుక భాగంలో తకియా కిద్మత్ కింద 19.14 ఎకరాల భూమి ఉంది. ఈ భూమి కబ్జాకు గు రి కాకుండా ముతవల్లిలు పరిరక్షిస్తున్నారు.
 
 స.నెం 159/ 7లో గల పంచబీబీ దర్గా కింద 5ఎకరాల భూమి ఉంది. దీనిని ముతవలీలు పరిరక్షిస్తున్నారు.  ఇప్పపల్లిలోని 33/అ స.నెంలో 2.23 పీర్ల మసీదు కింద ఉంది. 33/ఆలో 2.22 ఎకరాలు ఉంది. హుగ్గెల్లిలోని పీర్ల మసీదు కింద 78 స.నెంలో 2.37 ఎకరాల్లో వక్ఫ్ భూమి ఉంది. హోతి(కె)లోని త కియా కింద స.నెం 108లో 5.04 ఎ, స.నెం.21లో 1.31 ఎకరాలు, స.నెం 22లో హజ్మతుల్ కిద్మత్ కింద 11.24 ఎకరాలుంది. శేఖాపూర్ షాబుద్దీన్ దర్గా కింద స. నెం 203లో 4.11 ఎకరాలు, ఈద్గా దర్గా కింద స.నెం 284 లో 14.20 ఎకరాలు, స.నెం 285లో 1.35 ఎకరాలంది. .
 
 పటాన్‌చెరులో పటాయించారు...
 పటాన్‌చెరు నియోజకవర్గంలో దాదాపు 1000 ఎకరాల భూమి ఉన్నట్లు అంచనా.  రెవెన్యూ నివేదికల ప్రకారం మొత్తం 192 ఎకరాల భూమికి మాత్రమే రికార్డులు ఉన్నాయి. ఇందులో పటాన్ చెరు మండలంలో 38 ఎకరాలు, జిన్నారం152, ఆర్‌సీ పురం 4 ఎకారాలకు మాత్రమే రికార్డులు ఉన్నాయి. వీటిలో  30 ఎకరాలు కూడా లేదని రెవిన్యూ అధికారులే చెప్తున్నారు.
 
 సంగారెడ్డిలో కేవలం 24 ఎకరాలేనటా...
 నియోజకవర్గంలో 24 ఎకరాలు ఉన్నట్లు రెవెన్యూ రికార్డులు చెబుతున్నాయి. చిద్రుప, కంది, కలబ్, కాశీపూర్ గ్రామల్లో 14.31 ఎకరాలు ఉంది. సదాశివపేట 8.2 ఎకరాలు, సద్దాపూర్‌గౌని, ఆత్మకూర్‌గేట్‌లో ఎకరమే ఉంది.
 
 గజ్వేల్‌లో గల్లంతు
 నియోజకవర్గంలో 1503.13 ఎకరాల భూమి ఉండేది. గజ్వేల్ మండలంలోని 14గ్రామాల్లో 768.18 ఎకరాల వక్ఫ్‌భూములుండగా ప్రత్యేకించి గజ్వేల్ పట్టణంలో 400 ఎకరాలున్నాయి. ఇప్పటికే ఈ భూముల్లో 70శాతం వరకు అక్రమాల పాలై నిర్మాణాలు జరిగిపోయాయి. మిగిలిన 30శాతం భూముల్లో సైతం 2011నుంచి స్థానిక నాయకుల అండతో వక్ఫ్‌బోర్డు తమకు భూములను లీజుకు ఇచ్చిం దనే నెపంతో రాత్రికి రాత్రికి ఇళ్ల నిర్మాణాలను చేపట్టారు. ఈ అక్రమాలకు తనను సహకరించాలని వత్తిడి తెస్తున్నారని 2011 ఫిబ్రవరి 19న అప్పటి గజ్వేల్ మేజర్ పంచాయతీ కార్యానిర్వాహణాధికారి కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. దీనిపై కొన్ని రోజులు విచారణ జరిగింది. ఆక్రమణలు కూ ల్చేస్తామంటూ హడావిడి చేశారు. కానీ రాజకీయ వత్తిళ్లు పెరిగి అధికారులు మిన్నకుండిపోయారు. ఇక బయ్యారంలో మరో 300 ఎకరాలకు పైగా ఉన్నది. ఇందులో దాదాపు 100 ఎకరాలు కబ్జా అయింది. మిగిలిన గ్రామాల్లో గుంటల్లో మాత్రమే ఈ భూమి ఉన్నది. ఇది కూడా అక్రమార్కుల్లోకి వెళ్లినట్లు సమాచారం. ములుగు మండలంలోని 23గ్రామాల్లో 29.20ఎకరాలున్నాయి. ఇందులో ఎక్కువ భాగం కబ్జా కోరల్లో చిక్కుకుంది. జగదేవ్‌పూర్ మండలంలో 130 ఎకరాలుండగా దీనిదీ అదే పరిస్థితి. కొండపాక మండలంలో 9 ఎకరాలుండగా ఇందులో స్మశానవాటికలు వెలిశాయి. వర్గల్ మండలంలో 246.15ఎకరాలుండగా సింహభాగం అక్రమార్కుల చేతుల్లోనే ఉంది.
 
 తూప్రాన్ మండలంలో 319.04 ఎకరాలుండగా తూప్రాన్ పట్టణంలో 103 ఎకరాలు, కూచారంలో 178.02 ఎకరాలు, కాళ్లకల్‌లో 17.02ఎకరాలు ఉంది. మిగిలిన 13గ్రామాల్లో మిగితా విస్తీర్ణం ఉన్నది. తూప్రాన్‌లోని వక్ఫ్‌భూముల్లో ఇళ్ల నిర్మాణం జరిగింది. కూచారం ఆక్రమణలకు గురయ్యాయి. కాళ్లకల్‌లోనూ ఇదే పరిస్థితి నెలకొన్నది.
 
 మెదక్‌లోనూ మింగేశారు
 నియోజకవర్గంలో 754.53 ఎకరాలుండగా పాపన్నపేట మండలంలో 22ఎకరాల 24 గుంటల వక్త్ప్‌బోర్డు భూములున్నాయి. పాపన్నపేటలో 217 సర్వే నంబర్‌లో 4ఎకరాల 37గుంటలుండగా ఎలాంటి వివాదం లేదు. చిత్రియాల్‌లో  34సర్వే నంబర్‌లో 1ఎకర 35 గుంటలు,  291 సర్వే నంబ ర్‌లో7 ఎకరాల 34గుంటల వక్త్ప్‌బోర్డుభూమి ఉంది. దీనిని హక్కుదారులే అనుభవిస్తున్నారు. అన్నారంలో 25/ఆ సర్వే నంబర్‌లో ఎకరం ఉంది. నాగ్సాన్‌పల్లిలోని 8 సర్వేనంబర్‌లో 5గుంటలు, 510 సర్వే నంబర్‌లో 7గుంటలు. కొత్తపల్లిలోని 479 సర్వే నంబర్‌లో 20గుంటలుంది.
 
 వాటిపై వివాదం ఉంది. పొడ్చన్‌పల్లిలో సర్వే నంబర్ 291లో 6 ఎకరాలు 8 గుంటలు, 446 సర్వే నంబర్‌లో 29 గుంటల అసూర్ ఖానా భూమి ఉంది. దీనిని లక్ష్మినగర్ గ్రామానికి చెందిన కొమ్మలపాటి నాగేశ్వర్‌రావు తండ్రి సుబ్బారావుకు ముస్తాక్ హుస్సెన్ 99యేళ్ల లీజుకు ఇచ్చినట్లు సమాచారం. ఇది ఆక్రమణకు గురైంది ఫిర్యాదు రావడంతో విచారణ కొనసాగుతుంది. మెదక్ పట్టణం, మండలంలో మొత్తం 315 ఎకరాల 6గుంటల భూమి ఉంది. ఈ భూమి వక్త్ప్ బోర్డు పరిధిలో ఉంది. మెదక్ పట్టణంలోని అరబ్ గల్లిలోని361 సర్వేనంబర్‌లో 12 ఎకరాల 4గుంటలుంది. ఈ భూమి ఇద్దరు వ్యక్తుల పేరిట ఉంది. దీనిపై వక్త్ప్‌బోర్డు అధికారులు నోటీసులు జారీ చేశారు. కేసు నడుస్తోంది. మెదక్ మండలం చిట్యాల గ్రామంలోని 351 సర్వే నంబర్‌లో 9 ఎకరాల 8 గుంటల భూమి ఉంది. ఈ ముగ్గురు వ్యక్తుల పేరిట 1994లో రిజిస్ట్రేషన్ అయ్యింది. దీనిపై కేసులు నమోదు కాగా జేసీ కోర్టులో పెండింగ్‌లో ఉంది. మిగతా భూమి అంతా మజీద్‌ల ఆధీనంలోనే ఉంది. చిన్నశంకరంపేట మండలంలో 416 ఎకరాల 2 గుంటలుండగా మండలంలోని సూరారంలో 325 ఎకరాలు ఉంది. దీనిలో కొంత వక్త్ప్‌బోర్డు, కొంత రైతుల చేతుల్లో ఉంది.
 
 గజగట్లపల్లి, చందాపూర్, చందంపేట, చిన్నశంకరంపేట, అంబాజిపేట, కామారం, ఖాజాపూర్, టి. మాందాపూర్ గ్రామాల్లో వక్త్ప్ భూమి రైతుల ఆధీనంలో ఉంది. రామాయంపేట మండలంలో మొత్తం 13 ఎకరాల వక్త్ప్ భూమి ఉంది. రామాయంపేటలో 4 ఎకరాలు, నస్కల్ గ్రామంలో 3 ఎకరాలు, నిజాంపేటలో ఒక ఎకరం, కల్వకుంటలో 2 ఎకరాలు, లకా్ష్మపూర్‌లో 2 ఎకరాలు, డి.ధర్మారంలో ఒక ఎకరం మేర వక్త్ప్‌బోర్డు భూములు ఉన్నాయి. ఇవి ఎలాంటి కబ్జాలకు గురి కాలేదు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement