
బలమైన శత్రువును ఢీకొన్నాం: కేసీఆర్
బలమైన శత్రువును ఢీకొని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు అన్నారు. తెలంగాణ సాధనాసమరం చారిత్రాత్మకమైనదని ఆయన చెప్పారు. సింగపూర్లో ఉన్న తెలంగాణ ఎన్నారైలతో కేసీఆర్ గురువారం భేటీ అయ్యారు.
విదేశాల్లో తెలంగాణ వాణి, బాణి వినిపించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలని ఆయన తెలిపారు. ఇన్నాళ్లుగా తెలంగాణలో ఉన్న వలసవాదులు, దోపిడీదారులతో తెలంగాణ సమాజం తన అస్తిత్వాన్నే కోల్పోయిందని చెప్పారు. చిన్నాభిన్నమైన తెలంగాణ సంస్కృతిని మళ్లీ ఇప్పుడు కొత్తగా నిర్మించుకోవాల్సి ఉందని కేసీఆర్ అన్నారు.