సింగపూర్ ఇన్వెస్టర్లకు కేసీఆర్ పూర్తిస్థాయి భరోసా! | Telangana CM KCR assures graft-free environment for Singapore investors | Sakshi
Sakshi News home page

సింగపూర్ ఇన్వెస్టర్లకు కేసీఆర్ పూర్తిస్థాయి భరోసా!

Published Thu, Aug 21 2014 3:22 PM | Last Updated on Wed, Aug 15 2018 9:22 PM

సింగపూర్ ఇన్వెస్టర్లకు కేసీఆర్ పూర్తిస్థాయి భరోసా! - Sakshi

సింగపూర్ ఇన్వెస్టర్లకు కేసీఆర్ పూర్తిస్థాయి భరోసా!

సింగపూర్: కొత్తగా ఏర్పడిన రాష్ట్ర అభివృద్దికి అవినీతిరహిత వాతావారణంలో ప్రాజెక్టులకు తెలంగాణ ప్రభుత్వం ఆమోదం తెలుపుతుందని పెట్టుబడిదారులకు ముఖ్యమంత్రి కే.చంద్రశేఖరరావు భరోసా ఇచ్చారు. సింగపూర్ ఇన్వెస్టర్లతో జరిగిన బిజినెస్ మీటింగ్ లో కేసీఆర్ మాట్లాడుతూ.. పూర్తిస్థాయి రక్షణ, భద్రతా ఏర్పాట్లతో అవినితీరహిత రాష్ట్రంగా తెలంగాణ ఉంటుందని హామీ ఇచ్చారు. తెలంగాణలోని ఐటీ రంగంలో విసృత స్థాయిలో అవకాశాలున్నాయని కేసీఆర్ అన్నారు. 
 
ఫార్మా, ఫుడ్ ప్రాసెసింగ్, ఆటో మొబైల్ రంగాల అభివృద్దికి తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని కేసీఆర్ తెలిపారు. ఇన్వెస్టర్ల ప్రతిపాదనలకు ఆలస్యం జరగకుండా ప్రభుత్వ అధికారులు, మంత్రులు ఆమోదం తెలిపే విధంగా యంత్రాంగాన్ని రూపొందిస్తున్నామని ఆయన అన్నారు. పరిశ్రమలకు పూర్తి స్థాయి విద్యుత్ ను అందించే విధంగా రానున్న ఆరు ఏళ్లలో 8 వేల మెగావాట్ల విద్యుత్ ను ఉత్పత్తికి ప్రభుత్వం కృషి చేస్తోందని కేసీఆర్ తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement