రక్షణ కల్పించేంత వరకు సమ్మె: జూడాలు
హైదరాబాద్: గాంధీ ఆస్పత్రిలో జూనియర్ డాక్టర్ల (జూడాల) సమ్మె కొనసాగుతునే ఉంది. జూనియర్ డాక్టర్ల సమ్మె కారణంగా గాంధీ ఆస్పత్రిలో అత్యవసర సేవలు మినహా వైద్య సేవలు నిలిపివేశారు.
తమ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వంతో చర్చించడానికి తాము సిద్ధమేనని జూడాలు తెలిపారు. తమకు పూర్తి స్థాయి రక్షణ కల్పిస్తామని హామీ ఇచ్చేవరకు సమ్మె కొనసాగిస్తామని జూడాలు తెలిపారు.
ఆస్పత్రిలో తమకు రక్షణ కల్పించాలంటూ దాదాపు 500 మంది జూనియర్ డాక్టర్లు మంగళవారం గాంధీ ఆసుపత్రి మెయిన్ గేట్ వద్ద సమ్మెను కొనసాగిస్తున్నారు.