సాక్షి, హైదరాబాద్: ఉద్యోగులు, జర్నలిస్టుల కోసం త్వరలో హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి, వరంగల్, కరీంనగర్‌లలో వెల్‌నెస్ సెంటర్లు ప్రారంభిస్తామని ఉద్యోగులు, జర్నలిస్టుల ఆరోగ్య పథకం (ఈజేహెచ్‌ఎస్) సీఈవో డాక్టర్ కల్వకుంట్ల పద్మ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉన్న రెండు వెల్‌నెస్ సెంటర్లకు పెద్ద ఎత్తున స్పందన లభిస్తోందన్నారు.
మూడున్నర నెలల్లో 34,710 మంది ఔట్ పేషెంట్లు వచ్చారన్నారు. హైదరాబాద్ ఖైరతాబాద్ వెల్‌నెస్ సెంటర్‌ను డిసెంబర్ 18 ప్రారంభించగా, వనస్థలిపురం వెల్‌నెస్ సెంటర్ నెల రోజుల నుంచి వైద్య సేవలు అందిస్తోందన్నారు. మెరుగైన వైద్య చికిత్సకు ఈ వెల్‌నెస్ సెంటర్లు రిఫర్ చేస్తేనే కార్పొరేట్, ఇతర ప్రైవేటు ఆస్పత్రుల్లో వైద్యం చేయించుకోవచ్చన్నారు.