
శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగిస్తాం: హరీష్ రావు
తెలంగాణ రాష్ట్రంలో పంటలు ఎండిపోకుండా ఉండేందుకే తాము శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నట్లు తెలంగాణ నీటిపారుదల, విద్యుత్ శాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు.
తెలంగాణ రాష్ట్రంలో పంటలు ఎండిపోకుండా ఉండేందుకే తాము శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నట్లు తెలంగాణ నీటిపారుదల, విద్యుత్ శాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు. ఇక్కడ విద్యుత్ ఉత్పత్తిని కొనసాగిస్తామని, దీనిపై రాజకీయాలు చేయడం తగదని ఆయన అన్నారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ వ్యవహారంలో అసత్యాలు ప్రచారం చేస్తోందని హరీష్ విమర్శించారు. బయటి దొంగలే కాదు.. ఇంటి దొంగలు కూడా తెలంగాణపై కుట్ర పన్నుతున్నారని ఆయన మండిపడ్డారు.