మూడేళ్లలో ప్రాజెక్టులు పూర్తి | Within three years of completion of projects | Sakshi
Sakshi News home page

మూడేళ్లలో ప్రాజెక్టులు పూర్తి

Published Wed, Oct 8 2014 3:36 AM | Last Updated on Sat, Sep 2 2017 2:29 PM

మూడేళ్లలో ప్రాజెక్టులు పూర్తి

మూడేళ్లలో ప్రాజెక్టులు పూర్తి

ఎంపీ జితేందర్‌రెడ్డి వెల్లడి
 మక్తల్: వచ్చే మూడేళ్లలో జిల్లాలోని ప్రధాన సాగునీటి ప్రాజెక్టులను పూర్తిచేసి 15లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామని ఎంపీ ఏపీ జితేందర్‌రెడ్డి అన్నారు. మక్తల్ నియోజకవర్గంలోని రాజీవ్‌భీమా, సంగంబండ, భూత్పూ ర్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లను పూర్తిచేసి ఈప్రాంత రైతులకు సాగునీరు అందించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.

మంగళవారం మక్తల్ పట్టణంలోని నెహ్రూగంజ్ మార్కెట్‌యార్డులో ఏర్పాటుచేసిన టీఆర్‌ఎస్ నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశం లో ఆయన ముఖ్యఅథితిగా పాల్గొని ప్రసంగించారు. గత పాలకుల నిర్లక్ష్యం కారణంగానే జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టుల పనులు నత్తనడకన కొనసాగాయని విమర్శించారు.

నిర్మాణదశలో ఉన్న భీమా, నెట్టెంపాడు, కల్వకుర్తి, కో యిల్‌సాగర్ ఎత్తిపోతల పథకాలను పూర్తిచేసేందుకు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానన్నారు. పాలమూరు ఎత్తిపోతల పథకం నిర్మాణం కోసం ఇప్పటికే పూర్తిస్థాయిలో సర్వే జరిపించి ప్రభుత్వానికి నివేదిక అందించినట్లు తెలి పారు. జిల్లాను అన్నిరంగాల్లో అభివృద్ధిచేసి నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కృషిచేస్తానని ఎంపీ జితేందర్‌రెడ్డి భరోసాఇచ్చా రు. బంగారు తెలంగాణ పునర్‌నిర్మాణంలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. అంతకుముందు పట్టణంలోని నల్లజానమ్మ ఆలయం నుంచి భారీర్యాలీ నిర్వహించి.. స్థానిక చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించారు.

సమావేశంలో మాజీమంత్రి వై.ఎల్లారెడ్డి, టీఆర్‌ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడు దేవరి మల్లప్ప, మాజీ ఎమ్మెల్యే స్వర్ణసుధాకర్‌రెడ్డి, టీఆర్‌ఎస్ జిల్లా కార్యదర్శి సూర్య నారాయణగుప్త, నారాయణపేట నియోజకవర్గం ఇన్‌చార్జి శివకుమార్‌రెడ్డి, మక్తల్ మార్కెట్‌కమిటీ మాజీచైర్మన్ రవికుమార్ యాద వ్, నాయకులు లక్ష్మారెడ్డి, తిమ్మన్న, లక్ష్మణ్  తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement