jitendar reddy
-
మంగ్లీ కొత్త పాట 'లచ్చిమక్క' సాంగ్ విడుదల
ముదుగంటి క్రియేషన్స్ పై ముదుగంటి రవీందర్ రెడ్డి గారు నిర్మాతగా ఉయ్యాల జంపాల, మజ్ను సినిమాలతో దర్శకుడుగా గుర్తింపు తెచ్చుకున్న విరించి వర్మ దర్శకత్వంలో పేక మేడలు సినిమాతో నిర్మాతగా బాహుబలి, ఎవరికి చెప్పొద్దు వంటి సినిమాలతో నటుడిగా పేరు తెచ్చుకున్న రాకేష్ వర్రె లీడ్ రోల్ లో నటించిన సినిమా జితేందర్ రెడ్డి. 1980 కాలంలో జరిగిన వాస్తవిక సంఘటనలు ఆధారంగా పొలిటికల్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కుతోంది. వైశాలి రాజ్, రియా సుమన్, చత్రపతి శేఖర్, సుబ్బరాజు మరియు రవి ప్రకాష్ ఇతర ముఖ్య పాత్రలో నటించారు. గతంలో ఈ సినిమాకి సంబంధించిన టైటిల్ ఫస్ట్ లుక్ పోస్టర్ మరియు గ్లింప్స్ సినిమా పైన అంచనాలను పెంచేసాయి. రీసెంట్ గానే విడుదల అయిన అ ఆ ఇ ఈ ఉ ఊ సాంగ్ మంచి ప్రేక్షక ఆదరణ పొందింది, ముఖ్యంగా యువతకి ఆ పాట బాగా నచ్చింది. ఆ సాంగ్ కాలేజీ బ్యాక్ డ్రాప్ కాగా ఇప్పుడు విడుదలైన ఈ ‘లచ్చిమక్క’ సాంగ్ పెళ్లి బ్యాక్ డ్రాప్ లో ఉంది. ఈ పాటకి గోపి సుందర్ మ్యూజిక్ అందించగా రాంబాబు గోసాల లిరిక్స్ రాశారు మరియు మంగ్లీ ఈ పాటని చాలా బాగా పాడారు. జితేందర్ రెడ్డి ఇంట్లో జరిగే పెళ్ళిలో సరదాగా సాగే ఒక పాటలా ఉంది. 1980' లో లొకేషన్స్ అన్ని కూడా చాలా నాట్యురల్ గా ఉన్నాయి. ఈ పాత ద్వార కథలో ట్విస్టులు ఉన్నట్టు అర్ధమవుతుంది. ఈ సందర్భంగా ప్రొడ్యూసర్ ముదిగంటి రవీందర్ రెడ్డి గారు మాట్లాడుతూ: ఈ సినిమాకి సంబంధించి ఇప్పటి వరుకు రిలీజ్ అయిన గ్లింప్స్, టీజర్, సాంగ్స్ అన్ని కూడా మంచి ఆదరణ పొందాయి. ప్రేక్షకులు కొత్త నిర్మాతలమైనా మన్నలిని ఇంత బాగా ఆదరిస్తున్నారు. కంటెంట్ ఉంటె మన తెలుగు ప్రేక్షకులు ఎప్పుడు ఆ సినిమాని ఆదరిస్తారు అని మరో సారి నిరూపించారు. ప్రస్తుతం వస్తున్న కథలకి పూర్తి భిన్నంగా ఉంది ఈ జితేందర్ రెడ్డి. ఈ సినిమా మే 3న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. -
వీడిన సస్పెన్స్..! లోక్‌సభ అభ్యర్థిగా డీకే అరుణ..
మహబూబ్‌నగర్: మహబూబ్‌నగర్ పార్లమెంట్ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి ఎవరనే దానిపై సస్పెన్స్ వీడింది. మాజీ మంత్రి, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ పేరు ఖరారైంది. ఈ లోక్‌సభకు సంబంధించి డీకే అరుణతో పాటు పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు ఏపీ జితేందర్‌రెడ్డి, రాష్ట్ర కోశాధికారి శాంతికుమార్ మధ్య టికెట్ పోరు కొనసాగడంతో అధిష్టానం పెండింగ్‌లో పెట్టిన విషయం తెలిసిందే. ఎట్టకేలకు బుధవారం రెండో జాబితాను ప్రకటించగా.. మహబూబ్‌నగర్ నుంచి డీకే అరుణకు చోటు దక్కింది. నాగర్‌కర్నూల్ లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా ఎంపీ రాములు కుమారుడు, కల్వకుర్తి జెడ్పీటీసీ సభ్యుడు భరత్ ప్రసాద్ పేరును తొలి జాబితాలోనే ప్రకటించారు. ఉమ్మడి జిల్లాలో రెండు లోక్‌సభ స్థానాలకు బీజేపీ అభ్యర్థులు ఖరారుకావడంతో ప్రచారం జోరందుకోనున్నట్లు తెలుస్తోంది. ఇవి చదవండి: 'బీజేపీ టికెట్' నగేశ్‌కే.. -
జితేంద్రర్రెడ్డి ఇంటికి వెళ్లనున్న బండి సంజయ్
-
పాలమూరును పరుగులెత్తిస్తాం
కొత్తూరు: పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టును పరుగులెత్తించే దిశగా సీఎం కేసీఆర్ కార్యాచరణ ప్రారంభించినట్లు ఎంపీలు జితేందర్‌రెడ్డి, బండ ప్రకాశ్ తెలిపారు. కొత్తూరు మండలంలోని జేపీ దర్గాలో స్థానిక ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన ప్రార్థనలో వారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయనతో కలిసి బాబాకు చాదర్ సమర్పించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ.. సీఎం పనితీరు, అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుతోనే రెండోసారి టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిందన్నారు. సీఎం కేసీఆర్ ఉద్యమనేతగా క్షేత్రస్థాయిలో అన్ని వర్గాల ఇబ్బందులు, సమస్యలను గుర్తించి వాటి పరిష్కారం కోసమే వివిధ రకాల పథకాలను అమలు చేస్తున్నట్లు వివరించారు. ప్రస్తుతం తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలను ఇతర రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకుంటున్నాయని చెప్పారు. ఎత్తిపోతలపై ప్రత్యేక దృష్టి సీఎం కేసీఆర్ పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై ప్రత్యేక దృష్టి సారించినట్లు ఎంపీలు జితేందర్‌రెడ్డి, బండ ప్రకాశ్ తెలియజేశారు. ఇప్పటికే ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని విషయాలు, నిధుల వ్యయం విషయంలో ఆయన ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నట్లు వివరించారు. సాధ్యమైనంత త్వరలో పనులు ప్రారంభించి పూర్తి చేసేందుకు కేసీఆర్ కృతనిశ్చయంతో ఉన్నట్లు పేర్కొన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో చేపట్టిన పలు ప్రాజెక్టుల నిర్మాణాలు చివరి దశలో ఉన్నట్లు వివరించారు. పవిత్రమైన జహంగీర్ పీర్ దర్గా అభివృద్ధికి తమ వంతు కృషి చేయనున్నట్లు ఎంపీలు పేర్కొన్నారు. ఇప్పటికే సీఎం కేసీఆర్ దర్గా అభివృద్ధి కోసం నిధులు మంజూరు చేసేందుకు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా వక్ఫ్‌బోర్డు అధికారులు దర్గా అభివృద్ధికి సంబంధించిన నివేదికలను, మ్యాప్‌ను రూపొందించినట్లు తెలిపారు. తుది మ్యాప్ అనంతరం సీఎం సూచన ప్రకారం దర్గాలో అభివృద్ధి పనులు ప్రారంభించనున్నట్లు తెలియజేశారు. -
విశ్వేశ్వర్‌రెడ్డి మతితప్పి మాట్లాడుతున్నారు!
సాక్షి, మహబూబ్ నగర్ : ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరి.. టీఆర్ఎస్పై తీవ్ర ఆరోపణలు చేస్తున్న ఎంపీ విశ్వేశ్వర్‌రెడ్డి తీరుపై టీఆర్ఎస్ సీనియర్ ఎంపీ జితేందర్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. విశ్వేశ్వర్ రెడ్డి మతిస్థిమితం కోల్పోయి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. సోమవారం విలేకరులతో మాట్లాడిన జితేందర్‌రెడ్డి.. కేకే సహా తనతోపాటు సీనియర్ ఎంపీలు టీఆర్ఎస్ను వీడేందుకు సిద్ధంగా ఉన్నారన్న విశ్వేశ్వర్‌రెడ్డి వ్యాఖ్యలపై స్పందించారు. ఆయన టీఆర్ఎస్ను వీడటానికి రియల్ ఎస్టెట్ వ్యాపారాలే కారణమని అన్నారు. రాజీనామాపత్రంలో కేసీఆర్‌ను కీర్తించిన విశ్వేశ్వర్‌రెడ్డి.. ఇప్పుడెందుకు విమర్శిస్తున్నారని, ఆయన తీరు దారుణమని మండిపడ్డారు. తాను, కేకే అసంతృప్తిగా ఉన్నామనటం అవాస్తవమని, పార్టీలో కేసీఆర్ తమకు సముచిత స్థానం ఇచ్చారని అన్నారు. ఇక, ఏ ఎంపీ కూడా టీఆర్ఎస్ను వీడబోరని స్పష్టం చేశారు. రాజకీయాల్లో ఉన్నన్ని రోజులు కేసీఆర్ నాయకత్వంలోనే తాను పనిచేస్తానని చెప్పారు. -
అభివృద్ధిపై విమర్శలొద్దు
నారాయణపేట (మహబూబ్‌నగర్): ఎక్కడా లేనివిధంగా తెలంగాణలో అభివృద్ధి జరుగుతోంది.. దాన్ని చూసి ఓర్వలేక ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతున్నాయి.. ప్రం ద్రాగస్టున సీఎం కేసీఆర్ నేతృత్వంలో శ్రీకారం చుట్టిన కంటి వెలుగు కార్యక్రమానికి వస్తే పరీక్షలు చేయించి కళ్లు తెరిపిస్తాం.. జరిగిన అభివృద్ధి చూయిస్తాం.. అని రాజ్యసభ సభ్యుడు బండ్ల ప్రకాశ్, పార్లమెంట్ సభ్యుడు జితేందర్‌రెడ్డి అన్నారు. ఆదివారం నారాయణపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గ ప్రమాణస్వీకారోత్సవంలో వారు ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు. నీళ్లు..నియామకాలు.. నిధుల పేరు తో 14 సంవత్సరాలు పోరాడి రాష్ట్రాన్ని సాధించుకున్నామని, కేసీఆర్ నేతృత్వంలో రాష్ట్రం నంబర్ వన్ స్థానానికి అడుగులు వేస్తున్నదన్నారు. గత పాలకుల నిర్లక్ష్యంతో తెలంగాణ ప్రాంతం అన్ని విధాలుగా నష్ట పోయిందని విమర్శించారు. సాగునీటి ప్రాజెక్టుల ద్వారా ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో 18 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో పాలమూరు–రంగారెడ్డి సాగునీటి ప్రాజెక్టును నిర్మిస్తున్నామని, ఇప్పటికే జిల్లాలోని ప్రాజెక్టుల ద్వారా 7 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. 24 గంటల కరెంట్‌ను ఇచ్చిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానికి దక్కిందని, రైతులకు పెట్టుబడిసాయం కింద ఎకరాకు రూ.4 వేల చొప్పున ఇస్తూ ఏడాదికి ఖరీఫ్, రబీలో రూ.12 వేల కోట్ల బడ్జెట్‌ను కేటాయించామన్నారు. మత్స్యకారుకలకు ఉపాధి కల్పించేందుకు చెరువుల్లో చేపలు వదలడం, కురవలకు గొర్రెలు, యాదవులకు గేదేలు ఇస్తున్నామని తెలిపారు. 46 వేల చెరువులను పునరుద్ధరించాలనే లక్ష్యంతో మిషన్ కాకతీయ పథకానికి శ్రీకారం చుట్టి ఇప్పటికి 4 విడతల్లో 18 వేల చెరువులను పూర్తి చేసిందన్నారు. పేటకు కాటన్మార్కెట్ నారాయణపేట వ్యవసాయ మార్కెట్ యార్డులో కాటన్ మార్కెట్‌ను ఏర్పాటు చేసేందుకు తమ వంతు కృషి చేస్తామని ఎంపీ జితేందర్‌రెడ్డి భరోసానిచ్చారు. తెలంగాణ రాష్ట్రం 17.20 శాతం ఆర్థికాభివృద్ధి సాధిస్తూ ప్రపంచపుటాల్లోకి ఎక్కిందన్నారు. నేడు రాష్ట్రంలోని 58 లక్షల మంది రైతులకు రైతుబంధు చెక్కులు ఇస్తూ రూ.5 లక్షల బీమా సౌకర్యం కల్పించిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందన్నారు. నాలుగు రోజుల్లో నారాయణపేటకు మిషన్‌భగీరథ నీళ్లు వస్తాయన్నారు. జెడ్పీ చైర్మన్ బండారి భాస్కర్, ఎమ్మెల్యే ఎస్.రాజేందర్‌రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ గందె అనసూయ, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు శివకుమార్, వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. రైతుకు బాసటగా నిలిచాం దేవరకద్ర: రైతును అన్ని విధాలా ఆదుకుని వ్యవసాయాన్ని పండగ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం బాసటగా నిలిచిందని రాజ్యసభ సభ్యుడు బండ ప్రకాశ్ అన్నారు. ఆదివారం దేవరకద్ర మార్కెట్ కమిటీ పాలక వర్గం ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో ముఖ్య అథితిగా పాల్గొని ప్రసంగించారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చాక వ్యవసాయానికి పెద్దపీట వేసిందని, సాగునీటి వనరులను పెంచడానికి కొత్త ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టి రైతుకు అండగా నిలిచిందన్నారు. పాలమూర్–రంగారెడ్డి ఎత్తిపోతల పథకంకు రూ.35 వేల కోట్లను కేటాయించి 8 లక్షల ఎకరాలను సాగులోకి తీసుకురావడానికి కృషి చేస్తోందన్నారు. కాకతీయుల కాలంలో తవ్విన చెరువులు, కుంటలకు గత రాష్ట్రంలోని 46 వేల చెరువులను, కుంటలను పునరుద్ధరించే పనులను చేపట్టిందన్నారు. గత 60 ఏళ్లలో రాష్ట్రంలో 4 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సరిపోయే గోదాములు ఉండగా నాలుగేళ్లలో 19 లక్షల మెట్రిక్ టన్నుల గోదాములు అందుబాటులోకి తెచ్చామన్నారు. 24 గంటల ఉచిత విద్యుత్ అందించడం బృహత్తర కార్యక్రమమన్నారు. రిజర్వేషన్ల వల్లే.. ప్రభుత్వం అన్నివర్గాలకు అధికారం పంచాలనే ఉద్దేశ్యంలో మార్కెట్ యార్డుల్లో కూడా రిజర్వేషన్లు కల్పించి అందరికి అవకాశం కల్పించిందని ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి అన్నారు. దేవరకద్ర మార్కెట్ ఎస్సీలకు రిజర్వు చేయడం వల్ల ఒక దళితునికి చైర్మన్ అయ్యే అవకాశం వచ్చిందన్నారు. నూతన పాలక వర్గం రైతులకు అండగా ఉంటూ వారికి న్యాయం చేసే విధంగా చూడాలని కోరారు. ప్రమాణ స్వీకారోత్సవం.... నారాయణపేట, దేవరకద్ర వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలక మండలి ప్రమాణ స్వీకారోత్సవం అట్టహాసంగా జరిగింది. నారాయణపేట మార్కెట్ కమిటీ చైర్మన్‌గా సరాఫ్ నాగరాజు, దేవరకద్ర చైర్మన్‌గా దొబ్బలి ఆంజనేయులు, వైస్ చైర్మన్‌గా డోకూర్ రాములు ప్రమాణస్వీకారం చేశారు. దేవరకద్రలో జరిగిన కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ బండారి భాస్కర్, రాష్ట్ర స్పోర్ట్ అథారిటీ చైర్మన్ వెంకటేశ్వర్‌రెడ్డి, ఎంపీపీ ఇవీ.గోపాల్, చిన్నచింతకుంట ఎంపీపీ క్రాంతి, మాజీ మార్కెట్ చైర్మన్ జట్టి నర్సింహారెడ్డి, మండల టీఆర్ఎస్ అధ్యక్షుడు శ్రీకాంత్‌యాదవ్, హర్షవర్దన్‌రెడ్డి, నాయకులు కొండ శ్రీనివాస్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి, కుర్వ శ్రీను, వెంకటేశ్, బాలస్వామి, నరేందర్‌రెడ్డి, శివరాజు, సత్యనారాయణ పాల్గొన్నారు. -
కోవింద్‌ను బలపరుస్తూ టీఆర్ఎస్ సంతకం
న్యూఢిల్లీ: రాష్ట్రపతి ఎన్నికకు బీజేపీ ప్రతిపాదించిన అభ్యర్థి గెలవడానికి పూర్తి మెజారిటీ ఉన్నదని తెలిసికూడా.. ప్రతిపక్షాలు నామ్‌కే వాస్తే తమ అభ్యర్థిని పోటీకి నిలబెట్టాలని యోచిస్తున్నాయని టీఆర్ఎస్ ఎంపీ జితేందర్ రెడ్డి ధ్వజమెత్తారు. బుధవారం ఢిల్లీలోని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి అనంత్ కుమార్ నివాసానికి వెళ్లిన జితేందర్ రెడ్డి.. రాష్ట్రపతి పదవికి బీజేపీ ప్రతిపాదించిన రామ్‌నాథ్ కోవింద్ అభ్యర్థిత్వాన్ని బలపరుస్తూ టీఆర్ఎస్ పార్టీ తరఫున సంబంధిత పత్రాలపై సంతకం చేశారు. 23వ తేదీన జరగనున్న నామినేషన్ ప్రక్రియలో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు కూడా పాల్గొంటారని ఆయన తెలిపారు. రాష్ట్రపతి అభ్యర్థిగా దళితుడైన విద్యావేత్తను ఎంపిక చేయడాన్ని తమ పార్టీ స్వాగతించిందన్నారు. ఈ నెల 30వ తేదీన అర్ధరాత్రి పార్లమెంటులో జరగనున్న జీఎస్టీ ప్రారంభోత్సవ కార్యక్రమంలో కూడా కేసీఆర్ పాల్గొంటారని తెలిపారు. -
మూడేళ్లలో ప్రాజెక్టులు పూర్తి
ఎంపీ జితేందర్‌రెడ్డి వెల్లడి మక్తల్: వచ్చే మూడేళ్లలో జిల్లాలోని ప్రధాన సాగునీటి ప్రాజెక్టులను పూర్తిచేసి 15లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామని ఎంపీ ఏపీ జితేందర్‌రెడ్డి అన్నారు. మక్తల్ నియోజకవర్గంలోని రాజీవ్‌భీమా, సంగంబండ, భూత్పూ ర్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లను పూర్తిచేసి ఈప్రాంత రైతులకు సాగునీరు అందించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. మంగళవారం మక్తల్ పట్టణంలోని నెహ్రూగంజ్ మార్కెట్‌యార్డులో ఏర్పాటుచేసిన టీఆర్ఎస్ నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశం లో ఆయన ముఖ్యఅథితిగా పాల్గొని ప్రసంగించారు. గత పాలకుల నిర్లక్ష్యం కారణంగానే జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టుల పనులు నత్తనడకన కొనసాగాయని విమర్శించారు. నిర్మాణదశలో ఉన్న భీమా, నెట్టెంపాడు, కల్వకుర్తి, కో యిల్‌సాగర్ ఎత్తిపోతల పథకాలను పూర్తిచేసేందుకు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానన్నారు. పాలమూరు ఎత్తిపోతల పథకం నిర్మాణం కోసం ఇప్పటికే పూర్తిస్థాయిలో సర్వే జరిపించి ప్రభుత్వానికి నివేదిక అందించినట్లు తెలి పారు. జిల్లాను అన్నిరంగాల్లో అభివృద్ధిచేసి నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కృషిచేస్తానని ఎంపీ జితేందర్‌రెడ్డి భరోసాఇచ్చా రు. బంగారు తెలంగాణ పునర్నిర్మాణంలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. అంతకుముందు పట్టణంలోని నల్లజానమ్మ ఆలయం నుంచి భారీర్యాలీ నిర్వహించి.. స్థానిక చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించారు. సమావేశంలో మాజీమంత్రి వై.ఎల్లారెడ్డి, టీఆర్ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడు దేవరి మల్లప్ప, మాజీ ఎమ్మెల్యే స్వర్ణసుధాకర్‌రెడ్డి, టీఆర్ఎస్ జిల్లా కార్యదర్శి సూర్య నారాయణగుప్త, నారాయణపేట నియోజకవర్గం ఇన్చార్జి శివకుమార్‌రెడ్డి, మక్తల్ మార్కెట్‌కమిటీ మాజీచైర్మన్ రవికుమార్ యాద వ్, నాయకులు లక్ష్మారెడ్డి, తిమ్మన్న, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. -
బహిరంగ చర్చకు సిద్ధం: టీఆర్ఎస్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ భూములను ఎవరు కొల్లగొట్టారో తేల్చుకోవడానికి బహిరంగ చర్చకు టీడీపీ నేత రేవంత్‌రెడ్డి రావాలని మాజీమంత్రి, టీఆర్ఎస్ ఎమ్మెల్యే జూపల్లి కృష్ణారావు సవాల్ చేశారు.టీఆర్ఎస్ ఎంపీ జితేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు సి.లక్ష్మా రెడ్డి, గువ్వల బాలరాజు తదితరులతో కలసి ఆదివారం తెలంగాణభవన్‌లో ఆయన మాట్లాడుతూ తెలంగాణకు చెందిన రూ. వేలకోట్ల విలువైన భూములను చంద్రబాబు ధారాదత్తం చేసినప్పుడు రేవంత్‌రెడ్డి ఎందుకు నోరు మెదపలేదని ప్రశ్నించారు. ‘రేవంత్ చేస్తున్న ఆరోపణలపై మీడియా సాక్షిగా బహిరంగచర్చకు మేం సిద్ధ్దం. మెట్రో భూములను ఎవరికీ కేటాయించలేదు. రేవంత్ రెడ్డి చేస్తున్న ఆరోపణలను రుజువు చేసే దమ్ము, ధైర్యం ఉంటే బహిరంగచర్చకు రావాలి. ఆరోపణలను రుజువు చేయలేకుంటే రేవంత్‌రెడ్డి గుండు గీయించుకుంటడా? అసత్య ఆరోపణలు చేయిస్తున్న చంద్రబాబుకు గుండు గీయిస్తడా? లేదా? అని జూపల్లి సవాల్ చేశారు. మెట్రో భూములపై అర్థంలేని ఆరోపణలతో తెలంగాణ ప్రభుత్వ ప్రతిష్టను దిగజార్చాలని కుట్రలు చేస్తున్నాడని విమర్శించారు.తెలంగాణ ఏర్పాటుకోసం కేసీఆర్‌తో సహా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేసి త్యాగాలకు పాల్పడితే మూడేళ్లు దాటినా పదవులను పట్టుకుని వేలాడిన రేవంత్ రెడ్డి లాంటి టీడీపీ నేతలు ఇప్పుడేమో నోటికొచ్చినట్టుగా మాట్లాడితే ప్రజలు క్షమిస్తారా? అని జూపల్లి ప్రశ్నించారు. అసత్య ఆరోపణలతో మెట్రో రైలు ప్రాజెక్టును ఆపాలని చంద్రబాబు కుట్రకు దిగుతున్నాడని విమర్శించారు. కరీంనగర్ ఎంపీ వినోద్‌కుమార్ వేరుగా మీడియాతో మాట్లాడుతూ మెట్రో రైలుపై అఖిలపక్షాన్ని అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు అడగలేదని జానారెడ్డిని ప్రశ్నించారు. అప్పుడు నోరు మెదపకుండా ఇప్పుడెందుకు మాట్లాడుతున్నాడని ప్రశ్నించారు. -
కలెక్టర్‌కు శుభాకాంక్షలు తెలిపిన ఎంపీ
మహబూబ్‌నగర్ టౌన్: మహబూబ్‌నగర్ ఎంపీ జితేందర్ రెడ్డి ఆదివారం జిల్లా కలెక్టర్ జీడి ప్రియదర్శినిని తన చాంబర్లో కలిసి పూలబొకే ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి తాను ఢిల్లీలో ఉన్నందున రాలేకపోయానని చెప్పారు. ప్రభుత్వం చేపట్టిన నిరుపేద దళితులకు 3ఎకరాల భూమిని పంపిణీ చేసేందుకు అతి తక్కువ సమయంలో లబ్ధిదారులను గుర్తించి భూమి పంపిణీ చేయడం గర్వించదగ్గ విషయమని అభినందించారు. ప్రస్తుతం చేపట్టేబోయే సమగ్ర సర్వేను అదే తరహాలో చేపట్టి విజయవంతం చేయాలని కోరారు. దీంతోపాటు, ప్రభుత్వం పేదల కోసం అమలు చేసే ప్రతి సంక్షేమ పథకాన్ని అర్హులందరికీ అందించేందుకు కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ జాగృతి నేత వెంకట్ రెడ్డి, సురేందర్ రెడ్డితోపాటు, ఇతర నేతలు తదితరులు పాల్గొన్నారు. -
'చంద్రబాబుకు ధీటుగా లాబీయింగ్ చేస్తా'
హైదరాబాద్ : బీజేపీ అగ్ర నేతలతో తనకున్న పరిచయాలతో తెలంగాణకు నిధులు, ప్రాజెక్టులు తీసుకు వస్తానని మహబూబ్‌నగర్ టీఆర్ఎస్ ఎంపీ, ఆ పార్టీ లోక్ సభ నేత జితేందర్ రెడ్డి తెలిపారు. టీడీపీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్‌కు కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ధీటుగా లాబీయింగ్ చేస్తామని ఆయన పేర్కొన్నారు. పార్లమెంట్ మొదటి సమావేశాల్లోనే పోలవరం ఆర్డినెన్స్‌పై గళం విప్పుతామని జితేందర్ రెడ్డి మంగళవారమిక్కడ స్పష్టం చేశారు. లోక్‌సభలో పోలవరం ఆర్డినెన్స్‌ను అడ్డుకుంటామని ఆయన అన్నారు. తెలంగాణకు అన్యాయం చేస్తే ఎన్డీయేపై పోరాడతామని జితేందర్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలవనున్నట్లు ఆయన చెప్పారు. త్వరలోనే నరేంద్ర మోడీని తెలంగాణకు ఆహ్వానిస్తామని ఆయన తెలిపారు. ఎన్టీయేతో సత్సంబంధాలు కొనసాగిస్తామని, కేంద్రానికి తాము ప్రతిపక్షం కాదన్నారు. -
టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేతగా కేకే
హైదరాబాద్ : టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేతగా కేశవరావు ఎంపిక అయ్యారు. లోక్‌సభలో టీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్‌గా జితేందర్ రెడ్డి, ఉప నాయకుడిగా వినోద్, విప్‌గా కడియం శ్రీహరిని టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ మంగళవారం నియమించారు. ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా ఉన్న కేశవరావు టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేతగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఇక మహబూబ్‌నగర్ నుంచి గెలిచిన జితేందర్‌రెడ్డి లోక్‌సభలో టిఆర్ఎస్ నాయకుడిగాగా, కరీంనగర్ లోక్‌సభ స్థానం నుంచి విజయం సాధించిన వినోద్‌కు ఉప నాయకుడిగా, వరంగల్ ఎంపీగా గెలుపొందిన కడియం శ్రీహరికి విప్ పదవి లభించింది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన కెసిఆర్.. అటు కాంగ్రెస్, ఇటు బిజెపితో సయోధ్యకు చొరవ చూపుతున్నారు. అందుకే రెండు పార్టీలతో మంచి సంబంధాలు ఉన్న నాయకులకు ఈ బాధ్యతలు అప్పగించారు.