కలెక్టర్‌కు శుభాకాంక్షలు తెలిపిన ఎంపీ | MP wished the collector | Sakshi
Sakshi News home page

కలెక్టర్‌కు శుభాకాంక్షలు తెలిపిన ఎంపీ

Published Mon, Aug 18 2014 3:42 AM | Last Updated on Thu, Mar 21 2019 8:35 PM

కలెక్టర్‌కు శుభాకాంక్షలు తెలిపిన ఎంపీ - Sakshi

కలెక్టర్‌కు శుభాకాంక్షలు తెలిపిన ఎంపీ

మహబూబ్‌నగర్ టౌన్: మహబూబ్‌నగర్ ఎంపీ జితేందర్ రెడ్డి ఆదివారం జిల్లా కలెక్టర్ జీడి ప్రియదర్శినిని తన చాంబర్‌లో కలిసి పూలబొకే ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి తాను ఢిల్లీలో ఉన్నందున రాలేకపోయానని చెప్పారు. ప్రభుత్వం చేపట్టిన నిరుపేద దళితులకు 3ఎకరాల భూమిని పంపిణీ చేసేందుకు అతి తక్కువ సమయంలో లబ్ధిదారులను గుర్తించి భూమి పంపిణీ చేయడం గర్వించదగ్గ విషయమని అభినందించారు.
 
ప్రస్తుతం చేపట్టేబోయే సమగ్ర సర్వేను అదే తరహాలో చేపట్టి విజయవంతం చేయాలని కోరారు. దీంతోపాటు, ప్రభుత్వం పేదల కోసం అమలు చేసే ప్రతి సంక్షేమ పథకాన్ని అర్హులందరికీ అందించేందుకు కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ జాగృతి నేత వెంకట్ రెడ్డి, సురేందర్ రెడ్డితోపాటు, ఇతర నేతలు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement