♦ పాఠశాలకు తాళం
♦ విద్యాశాఖ అధికారుల తీరుపై గ్రామస్తుల నిరసన
♦ గంట పాటు ధర్నా
బషీరాబాద్ : ‘ఉపాధ్యాయులు లేని పాఠశాలలో విద్యార్థులు ఉండి ఏం చేస్తారు?’ అని మండలంలోని ఎక్మాయి గ్రామస్తులు బుధవారం స్కూల్‌కు తాళం వేసి తమ పిల్లలను ఇళ్లకు పిలుచుకెళ్లారు. వివరాలిలా.. గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో దాదాపు 160 మంది విద్యార్థులు ఉన్నారు. అయితే ఇటీవల జరిగిన బదిలీల్లో పాఠశాలలో పని చేస్తున్న ముగ్గురు ఉపాధ్యాయులు బదిలీపై వెళ్లడంతో ఒక్క ఉపాధ్యాయుడు లేకుండా విద్యాధికారులు రిలీవ్ చేశారు. దీంతో రెండు నెలలుగా విద్యార్థులు పాఠశాలకు వచ్చిపోతున్నారు. ఈ విషయమై ఎస్‌ఎంసీ కమిటీ ఆధ్వర్యంలో ధర్నా చేయడంతో మరుసటి రోజు బషీరాబాద్‌లో విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయుడిని గ్రామానికి పంపారు.
ఆయన వారం రోజుల అనంతరం తిరిగి వెళ్లిపోయారు. అనంతరం ఎస్‌ఎంసీ కమిటీ సభ్యుల ఒత్తిడి మేరకు ఎంఈఓ రోజుకో ఉపాధ్యాయులను పంపారు. వారం రోజులుగా పాఠశాలకు ఉపాధ్యాయులు రాకపోవడంతో బుధవారం ఎస్‌ఎంసీ కమిటీ ఆధ్వర్యంలో తల్లిదండ్రులు ఎంఈఓ నర్సింగ్‌రావుకు ఫోన్ చేయగా.. ఉపాధ్యాయుడిని పంపారు. ఆయన 11.30 గంటలకు పాఠశాలకు చేరుకున్నాడు. పాఠశాల ఎస్‌ఎంసీ కమిటీ సమావేశానికి ఉపాధ్యాయుడు వెళ్లి.. తాను రోజూ పాఠశాలకు రాలేనని, ఆలస్యమైనా తన ను ఎవరూ ప్రశ్నకూడదని పేర్కొన్నారు. దీం తో ఎస్‌ఎంసీ కమిటీ చైర్మన్ నారాయణగౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
పాఠశాలకు సమయానికి రావడం కుదరదంటే ఎలా వచ్చారో అలా గే వెళ్లిపోవాలని కోరారు.అనంతరం గ్రామస్తులు టీచర్లు లేని పాఠశాలలో విద్యార్థులు ఎందుకు అంటూ.. తాళం వేసి పిల్లలను ఇళ్లకు పిలుచుకెళ్లారు. ఉపాధ్యాయులను నియమిం చాలని పలుమార్లు డీఈఓను కలిసి విన్నవించ డం జరిగిందని గౌడ్ వివరించారు. పాఠశాలకు ఉపాధ్యాయులను నియమించకుంటే పిల్లల భవిష్యత్ ప్రశ్నర్థకంగా మారుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అనంతరం ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ లావణ్య, ఉప సర్పంచ్ జనార ్దన్‌రెడ్డి, నాయకులు గోపాల్‌రెడ్డి, కాశప్ప, శ్యామప్ప, నాగప్ప, పాండు, మైమూద్, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులున్నారు.
టీచర్లు లేకపోతే విద్యార్థులెందుకు?
Published Thu, Aug 13 2015 3:01 AM | Last Updated on Wed, Mar 28 2018 11:08 AM
Advertisement
Advertisement