నకిలీ కరెన్సీ చెలామణి చేస్తున్న ఓ మహిళను బుధవారం సుల్తాన్‌బజార్ పోలీసులు అరెస్ట్‌చేసి రిమాండ్‌కు తరలించారు.
హైదరాబాద్ (సుల్తాన్‌బజార్): నకిలీ కరెన్సీ చెలామణి చేస్తున్న ఓ మహిళను బుధవారం సుల్తాన్‌బజార్ పోలీసులు అరెస్ట్‌చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఝార్ఖండ్ రాష్ట్రానికి చెందిన షేక్ రుబీనా(50), ఇటీవల నగరానికి వచ్చి రాణి, కైరున్నిసా, రఫీక్, నూర్‌లతో కాలిసి ఈసీఎల్ ప్రాంతంలో ఉంటోంది. బుధవారం కోఠి బ్యాంక్ స్ట్రీట్‌లో వినయ్ అనే చిరు వ్యాపారి వద్ద రూ.100ల నైట్ ప్యాంట్ కోనుగోలు చేసి రూ.1000 నకిలీ నోటు ఇచ్చింది.
వ్యాపారి తిరిగి రూ. 900 ఇచ్చారు. పక్కనే ఉన్న వ్యాపారులు బాలాజీ, ప్రవీణ్‌లకు అంతకు ముందు నకిలీ వెయ్యి రూపాయల నోట్లు ఇచ్చి వస్త్రాలు కొనుగోలు చేశారు. వారు వెయ్యి నోటు ఇచ్చిన మహిళను వెతుక్కుంటూ రావడంతో వినయ్ వద్ద నైట్ ప్యాంట్ కొనుగోలు చేస్తుండడంతో వారు గుర్తుపట్టి పట్టుకుని పోలీసులకు సమాచారం అందించారు. దీంతో సుల్తాన్‌బజార్ పోలీసులు రుబీనాను అరెస్ట్ చేసిరిమాండ్‌కు తరలించారు.