ఇంటికెళ్లి మాట ముచ్చట కలిపి.. అంతలోనే ! | woman theft the gold in hyderabad. | Sakshi
Sakshi News home page

ఇంటికెళ్లి మాట ముచ్చట కలిపి.. అంతలోనే !

Published Wed, Aug 16 2017 8:50 PM | Last Updated on Tue, Sep 4 2018 5:29 PM

ఇంటికెళ్లి మాట ముచ్చట కలిపి.. అంతలోనే ! - Sakshi

ఇంటికెళ్లి మాట ముచ్చట కలిపి.. అంతలోనే !

హైదరాబాద్‌: పక్కింటి మహిళను పరిచయం చేసుకుంది. అదును కోసం వేచి చూసి ఇంట్లో ఉన్న బంగారు గొలుసును తస్కరించింది. తరుచూ వారింటికి వెళ్లి మాట ముచ్చట కలిపి దగ్గరైంది. ఈ ఘటనలో యూసుఫ్‌గూడ కార్మికనగర్‌లో నివసించే ఎం.డి. మైమున్నా(29)ను జూబ్లీహిల్స్‌ పోలీసులు బుధవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఇన్‌స్పెక్టర్‌ వివరాలు వెల్లడించారు.

14 సంవత్సరాల క్రితం మైమున్నాకు ఇస్మాయిల్‌తో పెళ్లి అయింది. కానీ భర్త అనారోగ్యంతో మృతి చెందాడు. భర్త మరణాంతరం మహ్మద్‌ జానీ అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. ఆ మహిళ తాజుద్దీన్‌ అనే మరో వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తూ భర్తను వదిలేసింది.తాజుద్దీన్‌తో కలిసి కార్మికనగర్‌లో ఒక గది అద్దెకు తీసుకుని నివసిస్తున్నారు. అయితే ఆమెకు ఆర్థిక ఇబ్బందులు తీవ్రమయ్యాయి.

దీంతో పక్కా ప్లాన్‌తో పక్కింట్లో నివసిస్తున్న మహిళతో పరిచయాలు పెంచుకుంది. ఆమెతో కబుర్లు చెబుతూనే కళ్లు కప్పి నాలుగు రోజుల క్రితం అల్మారాలో ఉన్న నాలుగున్నర తులాల బంగారు ఆభరనాలు తస్కరించింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు విచారణ జరిపిన పోలీసులు ఆధారాలు సేకరించి రూ. 1.4 లక్షల విలువ చేసే ఆభరణాలను రికవరీ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement