సాక్షి, హైదరాబాద్ : కుషాయిగూడలోని ఏఎస్‌రావు నగర్‌లో శనివారం వేకువజామున భారీ చోరీ జరిగింది. ఓ ఇంట్లోకి ప్రవేశించిన దొంగలు 50 తులాల బంగారం, రూ.2 లక్షల నగదు అపహరించారు. ఈసీఐఎల్ విశ్రాంత ఉద్యోగి సూర‍్యనారాయణ కుటుంబం ఇంట్లో నిద్రిస్తుండగా వెనుక వైపు నుంచి దొంగలు ప్రవేశించి చోరీ చేశారు. చోరీ ఘటనపై బాధిత కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు చోరీ జరిగిన ఇంటిని పరిశీలించారు. దొంగల ఆచూకీ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.