ముదిగొండ: ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం వల్లభి గ్రామంలో ఓ వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. శివరాణి (25) ఇంట్లో ఉరేసుకుని ఉండటాన్ని మంగళవారం ఉదయం గుర్తించారు. స్థానికుల సమాచారంతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. శివరాణి భర్త నాగేశ్వరరావు పై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అతడ్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.