
తాగునీరు కోసం మహిళల ఆందోళన
కరీంనగర్(సుల్తానాబాద్): తాగునీటి సమస్యలను పరిష్కరించాలని కోరుతూ మహిళలు రోడ్డెక్కారు. ఈ ఘటన కరీంనగర్ జిల్లా సుల్తానాబాద్ మండలంలో గురువారం ఉదయం చోటుచేసుకుంది. మండలంలోని కంతానపల్లికి చెందిన పలువురు మహిళలు రాజీవ్ రహదారిపై ధర్నాకు దిగారు. ఈ ఆందోళన కారణంగా రహదారిపై రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఇప్పటికైనా అధికారులు, స్థానిక ప్రజాప్రతి నిధులు స్పందించి సమస్యను పరిష్కరించాలని బాధితులు డిమాండ్ చేశారు.