మెదక్ జిల్లా జిన్నారం మండలం గడ్డపోతారం పారిశ్రామిక వాడలో ఆదివారం ప్రమాదం చోటు చేసుకుంది.ఓ కంపెనీలో రియాక్టర్ పేలిపోవడంతో ఇద్దరు కార్మికులకు గాయాలయ్యాయి. ఫ్యాక్టరీల ఇన్‌స్పెక్టర్, కార్మికుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. గడ్డపోతారం పారిశ్రామిక వాడలోని యగ్‌మగ్ పరిశ్రమలో ఎప్పటిలాగే కార్మికులు రియాక్టర్ వద్ద విధులు నిర్వహిస్తున్నారు.
ప్రమాద వశాత్తు రియాక్టర్‌లో ఉండే రసాయనాల వత్తిడి ఎక్కువ అవ్వటంతో రియాక్టర పైకప్పుడు భారీ శభ్దంతో ఒక్క సారిగా పేలిపోయింది. దీంతో రియాక్టర్ వద్ద విధులు నిర్వహిస్తున్న ఋషీ, కిషోర్‌ల ఒంటిపై రసాయనాలు పడటంతో తీవ్రంగా గాయపడ్డారు. వీరిని షాపూర్ నగర్‌లోని ఓ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు.