రైతు వారీగా యాసంగి విస్తీర్ణం సేకరించండి | Yasangi crop acreage Pocharam Srinivasa Reddy in Center of Excellence | Sakshi
Sakshi News home page

రైతు వారీగా యాసంగి విస్తీర్ణం సేకరించండి

Published Thu, Feb 16 2017 2:56 AM | Last Updated on Mon, Sep 17 2018 8:21 PM

రైతు వారీగా యాసంగి విస్తీర్ణం సేకరించండి - Sakshi

రైతు వారీగా యాసంగి విస్తీర్ణం సేకరించండి

అధికారులకు పోచారం ఆదేశం
సాక్షి, హైదరాబాద్‌: రైతు వారీగా యాసంగి పంటల విస్తీర్ణం వివరాలను సమగ్రంగా సేకరించాలని అధి కారులను వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి ఆదేశించారు. బుధవారం హైదరాబాద్‌ జీడిమెట్లలోని సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌లో జిల్లా వ్యవసాయా ధికారులతో ఆయన సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా పోచారం మాట్లాడుతూ, రైతు వారీగా, పట్టాదారు వారీగా భూమి వివరాలను, పంట సాగు విస్తీర్ణం వివరాలను సేకరించాలని సూచించారు.

కొత్తగా నియమితులైన 1,311 వ్యవసాయ విస్తరణాధి కారుల సేవలను వినియోగించుకోవాలని రైతులకు విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ పథకాలు రైతులకు చేరినప్పుడే మంచి ఫలితాలు వస్తాయని, ఆ దిశగా వ్యవసాయ శాఖ కృషి చేయాలని కోరారు. ఈ సందర్భంగా వ్యవసాయ కార్యదర్శి సి.పార్థసారథి, కమిషనర్‌ జగన్‌మోహన్‌.. తాము అమలు చేస్తున్న పలు పథకాల గురించి జిల్లా వ్యవసాయ అధికారులతో సమీక్షించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement