ఎంజీఎం : ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) జిల్లాశాఖ ఎన్నికలు ఆదివారం ఉత్కంఠ భరితంగా సాగాయి. అధ్యక్ష, కార్యదర్శి స్థానాలకు హోరాహోరీగా జరిగిన ఎన్నికల్లో అధ్యక్షుడిగా ఎర్రా శ్రీధర్‌రాజు, కార్యదర్శిగా అన్వర్ గెలుపొందారు. శ్రీధర్‌రాజు 18 ఓట్ల తేడాతో రాజ్‌కుమార్‌పై విజయం సాధించగా, అన్వర్ 77 ఓట్ల మెజార్టీతో వంశీపై గెలుపొందారు. ఆదివారం ఉదయం 8 నుంచి రాత్రి 7 గంటలకు వరకు పోలింగ్ జరిగింది. మొత్తం 1,132 ఓట్లకు 696 ఓట్లు పోలయ్యాయి.
రౌండ్‌కు ఇలా..
రాత్రి 7.30 గంటల నుంచి 9 గంటల వరకు లెక్కింపు జరిగింది. రిటర్నింగ్ అధికారిగా వ్యవహరించిన డాక్టర్ కంకల మల్లేశం 9 గంటలకు ఫలితాలు వెల్లడించారు. మొదటి, రెండు రౌండ్లలో రాజ్‌కుమార్ పూర్తి ఆధిక్యం ప్రదర్శించారు. రెండు రౌండ్లు పూర్తయ్యేసరికి 26 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. మూడో రౌండ్‌లో ఎర్రా శ్రీధర్‌రాజు పుంజుకుని 20 ఓట్ల ఆధిక్యం సాధించారు. నాలుగో రౌండ్ కీలకంగా మారింది. నాలుగో రౌండ్‌లో శ్రీధర్‌రాజుకు 62 ఓట్లు రాగా రాజ్‌కుమార్‌కు 38 ఓట్లు వచ్చాయి. మొత్తంగా నాలుగు రౌండ్లు పూర్తయ్యేసరికి ఎర్రా శ్రీధార్‌రాజుకు 18 ఓట్ల మెజార్టీ వచ్చింది. మరోవైపు కార్యదర్శి ఎన్నికల్లో అన్వర్, వంశీలు పోటీ పడగా మొదటి రౌండ్ నుంచి అన్వర్ ఆధిక్యం సాధిస్తూ వచ్చారు. నాలుగు రౌండ్లు పూర్తయ్యేసరికి వంశీపై 77 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.
రాజయ్యకు చేదు అనుభవం
స్వయంగా వైద్యుడైన ఉప ముఖ్యమంత్రి రాజయ్యకు ఈ ఎన్నికలు చేదు అనుభవాన్ని మిగిల్చాయి. ఈసారి జరిగిన ఐఎంఏ ఎన్నికల్లో అధ్యక్ష స్థానానికి పోటీ చేస్తున్న డాక్టర్ రాజ్‌కుమార్‌ను అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నిక చేసేందుకు ప్రయత్నించారు. ప్రయత్నాలు బెడిసి కొట్టడంతో ఎన్నికలు అనివార్యంగా మారాయి. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నా డిప్యూటీ సీఎం రాజయ్య ప్రత్యేకంగా జిల్లాకు వచ్చి పోలింగ్‌లో పాల్గొన్నారు. కానీ.. చివరికి హోరాహోరీగా జరిగిన ఎన్నికల పోరులో రాజ్‌కుమార్ ఓటమి పాలుకావడం రాజయ్య కు ఇబ్బందిగా మారింది.
శ్రీధర్‌రాజు విజయం
Published Mon, Nov 10 2014 3:46 AM | Last Updated on Tue, Aug 14 2018 5:54 PM
Advertisement
Advertisement