
లక్డీకాపూల్: దేశంలో రాజ్యాంగ స్ఫూర్తిని నిలబెట్టుకోలేని పరిస్థితులు ఉత్పన్నమయ్యాయని రాజకీయ, సామాజిక ఉద్యమకారుడు యోగేంద్ర యాదవ్ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలంతా సంఘటితంగా పోరాడాల్సిన తరుణం ఆసన్నమైందన్నారు. శుక్రవారం బంజారాహిల్స్‌లోని లామకాన్‌లో సామాజిక న్యాయదినోత్సవాన్ని పురస్కరించుకుని పౌరసత్వం, రాజ్యాంగబద్ధత, సామాజిక న్యాయం, సీఏఏ, ఎన్‌ఆర్‌సీ, ఎన్‌పీఆర్ అంశంపై సమావేశం జరిగింది.
దీనికి ముఖ్య అతిథిగా హాజరైన యోగేంద్ర యాదవ్ మాట్లాడుతూ.. భిన్న సంస్కృతులు, విభిన్న సంప్రదాయాలకు జంట నగరాలు ప్రతీకగా నిలుస్తున్నాయన్నారు. సమైక్యతకు, సమానత్వానికి పట్టంకడుతున్న హైదరాబాద్ దేశానికి స్ఫూర్తిదాయకం కావాలన్నారు. దేశంలో అమలవుతున్న కుల వ్యవస్థ, మనుధర్మ స్మృతికి దళితులు, అట్టడుగు వర్గాల ప్రజ లు బలవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్రంలో ఎన్‌డీఏ ప్రభుత్వం వచ్చాక సామాజిక న్యాయానికి, లౌకిక వాదానికి వ్యతిరేకంగా పలు చర్యలు, చట్టాలు చేస్తోందన్నారు.
ముస్లింలను టార్గెట్ చేస్తోంది...
పౌరసత్వ సవరణ చట్టం ద్వారా కేంద్ర ప్రభుత్వం ముస్లింలను టార్గెట్ చేస్తోం దని ధ్వజమెత్తారు. దేశ సరిహద్దులో నో ముస్లిం ప్లీజ్ అన్న బోర్డులు ఏర్పాటు చేయడం దీనికి నిదర్శనమని యోగేంద్ర యాదవ్ అన్నారు. ఈ కార్యక్రమంలో దళిత బహుజన ఫ్రంట్ నాయకుడు పి.శంకర్, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment