మిర్యాలగూడ: నల్గొండ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. శుక్రవారం ఉదయం విద్యుత్ షాక్తో ఓ యువతి ప్రాణాలు కోల్పోయింది. మిర్యాలగూడ మండలం వెంకటాద్రిపాలెంకు చెందిన ద్వారకారాణి (22) అనే అవివాహిత ఇల్లు శుభ్రం చేస్తుంది. ఈ క్రమంలో ఆమె పోసిన నీళ్లు జీఐ వైరుకు తగలడంతో షాక్‌కు గురైంది. దీంతో ద్వారకారాణి అక్కడిక్కడే మృతి చెందింది. యువతి మృతితో స్థానికంగా విషాద చాయలు అలుముకున్నాయి.