లక్సెట్టిపేట : దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాలను నెరవేర్చుదామని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు అనిల్‌కుమార్ అన్నారు. ఆదివారం మండల కేంద్రానికి విచ్చేసిన ఆయన విలేకరులతో మాట్లాడారు. పేదల అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు కోసం వై ఎస్సార్ అహర్నిశలు కృషి చేశారని పేర్కొన్నా రు.
తెలంగాణ ప్రజలకు వైఎస్సార్ కాంగ్రెస్ పా ర్టీ అండగా ఉంటుందని తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారం, వారి అభివృద్ధి కోసం పోరాటం చేస్తూనే ఉంటుందని స్పష్టం చేశారు. ఈ నె ల 22, 23 తేదీల్లో కమిటీలను ఏర్పాటు చేస్తామ ని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పాలన పాత సీసాలో కొత్త సారా అన్న విధంగా నడుస్తోందని విమర్శించారు. రాష్ట్ర సభ్యులు మెస్రం శంకర్, యూత్ విభాగం జిల్లా అధ్యక్షుడు తిలక్‌రావు, సభ్యుడు మేదరి పాల్సన్, ఉట్నూరు మండల అధ్యక్షుడు కాంపెల్లి గంగాధర్, నాయకులు బోడ విజయ్‌కుమార్ పాల్గొన్నారు.
వైఎస్ ఆశయాలు నెరవేర్చుదాం
Published Mon, Apr 20 2015 3:10 AM | Last Updated on Sat, Jul 7 2018 2:56 PM
Advertisement
Advertisement