
'రాజన్న కుటుంబం వెంటే లక్షలాది కుటుంబాలు'
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి మరణాన్ని జీర్ణించుకోలేక నల్గొండ జిల్లాలో మృతిచెందిన వారి కుటుంబాలను పరామర్శించేందుకు వైఎస్ షర్మిల రేపటి నుంచి చేపడుతున్న పరామర్శయాత్రను జయప్రదం చేయాలని వైఎస్సార్ సీపీ తెలంగాణ అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కోరారు.
హైదరాబాద్: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి మరణాన్ని జీర్ణించుకోలేక నల్గొండ జిల్లాలో మృతిచెందిన వారి కుటుంబాలను పరామర్శించేందుకు వైఎస్ షర్మిల బుధవారం నుంచి చేపడుతున్న పరామర్శ యాత్రను జయప్రదం చేయాలని వైఎస్సార్ సీపీ తెలంగాణ అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కోరారు.
ఆయన మంగళవారమిక్కడ మాట్లాడుతూ... వైఎస్ఆర్ మరణాన్నితట్టుకోలేక చనిపోయిన వారికి వైఎస్ఆర్ సీపీ అండగా ఉంటుందనే భరోసా ఇవ్వడమే పరామర్శ యాత్ర ప్రధాన ఉద్దేశమన్నారు. తెలంగాణలో లక్షలాది కుటుంబాలు రాజన్న కుటుంబంతో నడిచేందుకు సిద్ధంగా ఉన్నాయని ఆయన తెలిపారు. ఈ యాత్ర తొలివిడతలో భాగంగా జిల్లాలోని 6 నియోజకవర్గాల పరిధిలో 30 కుటుంబాలను వైఎస్ షర్మిల పరామర్శిస్తారన్నారు.
దేవరకొండ నియోజకవర్గం నుంచి ప్రారంభమయ్యే ఈ పరామర్శ యాత్ర...మిర్యాలగూడ, నాగార్జునసాగర్, హుజూర్‌నగర్, కోదాడ, సూర్యాపేట నియోజకవర్గాల్లో 7 రోజుల పాటు సాగనుంది. రెండో విడతలో జిల్లాలోని మిగతా నియోజక వర్గాల్లో ఆమె పర్యటిస్తారు.