- పూలమాలలు వేసి నివాళి అర్పించిన
- వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధ్యక్షుడు పొంగులేటి
శామీర్ పేట్: కరీంనగర్‌లో నిర్వహిస్తున్న వైఎస్సార్ సీపీ బహిరంగ సభకు వెళ్తున్న ఆ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డికి నాయకులు, కార్యకర్తలు ఆదివారం రాజీవ్ రహదారిపై ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పొంగులేటి శామీర్‌పేట్‌లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ఆర్ విగ్రహానికి క్షీరాభిషేకం చేశారు.
పూలమాలలు వేసి ఆయనకు ఘనంగా నివాళి అర్పించారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు సురేశ్‌రెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి, రాష్ట్ర ప్రోగ్రాం కో ఆర్డినేటర్ సిద్ధార్థరెడ్డి, తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి బి.రఘురాంరెడ్డి (మీసాల రెడ్డి), ప్రచార కమిటీ ప్రధాన కార్యదర్శి జె. అమర్ నాథ్‌రెడ్డి, తెలంగాణ రాష్ట్ర యూత్ జనరల్ సెక్రటరీ సతీష్‌రెడ్డి, యూత్ రాష్ట్ర కార్యదర్శి కుమార్‌యాదవ్, జిల్లా ప్రోగ్రాం కో-ఆర్డినేటర్ టి.ఇన్నారెడ్డి, జిల్లా ట్రేడ్ యూనియన్ ప్రధాన కార్యదర్శి కె .శ్రీహరి రాజు, జిల్లా కార్యదర్శి ఎం.శ్రీనివాస్‌రాజు తదితరులు పాల్గొన్నారు.
వైఎస్‌ఆర్ విగ్రహానికి క్షీరాభిషేకం
Published Sun, Apr 19 2015 11:48 PM | Last Updated on Thu, Aug 9 2018 4:45 PM
Advertisement
Advertisement