అసెంబ్లీలో జీరో అవర్ | Zero Hour in the Assembly | Sakshi
Sakshi News home page

అసెంబ్లీలో జీరో అవర్

Published Sun, Nov 16 2014 12:26 AM | Last Updated on Fri, Aug 10 2018 8:08 PM

అసెంబ్లీలో జీరో అవర్ - Sakshi

అసెంబ్లీలో జీరో అవర్

ఆలయ భూముల పరిరక్షణకు కమిటీ
అర్చకులను ఆదుకుంటాం: మంత్రి ఈటెల


హైదరాబాద్: ఆలయ భూముల పరిరక్షణకు కమిటీ వేస్తామని ఆర్థికశాఖ మంత్రి ఈటెల రాజేం దర్ ప్రకటించారు. శనివారం అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో టీడీపీ సభ్యుడు చల్లా ధర్మారెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు. తెలంగాణ ఉద్యమంలో పాలుపంచుకున్న అర్చకులను ఆదుకునేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి భరోసా ఇచ్చారు. ‘యాదగిరిగుట్ట అభివృద్ధికి బడ్జెట్‌లో రూ.100 కోట్లు కేటాయించాం.

అర్చకులకు రూ.1500, ధూపదీప నైవేద్యాలకు రూ.1000 అందజేస్తున్నాం. అర్చకులు, ఉద్యోగుల సంక్షేమ నిధి ట్రస్టు కింద రూ.2 లక్షల మెడికల్ రీయింబర్స్‌మెంట్ చెల్లిస్తాం. వారి కుటుంబాల్లో జరిగే వివాహాలకు రూ.లక్ష రుణం అందిస్తాం. ఉపనయనానికి, పిల్లల చదువులకు రుణం, అయిదు వేల లోపు ఇంజనీరింగ్, రెండు వేల లోపు మెడిసిన్ ర్యాంక్ సాధించిన విద్యార్థులకు ప్రభుత్వమే ఫీజులు చెల్లిస్తుంది’ అని ప్రకటించారు.  
 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement