Minister Rajinder etela
-
ఆరోగ్యశ్రీ బకాయిలు రూ.200 కోట్లు
♦ తక్షణమే చెల్లించాలని ఆర్థిక మంత్రికి వైద్య మంత్రి విన్నపం ♦ కార్పొరేట్ ఆసుపత్రుల్లో వైద్యం అందక పేద రోగుల ఇక్కట్లు సాక్షి, హైదరాబాద్: ఆరోగ్యశ్రీ పథకానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి అందాల్సిన రూ.200 కోట్ల బకాయిలను వెంటనే విడుదల చేయాలని ఆర్థికశాఖ మంత్రి ఈటల రాజేందర్‌కు వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ సి.లక్ష్మారెడ్డి విన్నవించారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ఈటల, ఆర్థికశాఖ అధికారులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. బకాయిలు పేరుకుపోవడం వల్ల ప్రభుత్వ, ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రుల్లో పేదలు, ఉద్యోగుల వైద్యానికి విఘాతం కలుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే కొన్ని ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రులు ఆరోగ్యశ్రీ రోగులకు వైద్య సేవలు అందించడానికి నిరాకరిస్తున్నాయని ఆర్థికశాఖ అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై ఆర్థికమంత్రి సానుకూలంగా స్పందించారని లక్ష్మారెడ్డి వెల్లడించారు. ఆరోగ్యశ్రీ కింద 938 వ్యాధులకు, కేంద్ర ప్రభుత్వ పథకంలోని కొన్ని వ్యాధులకు వైద్యం అందుతోంది. ఆరోగ్యశ్రీ కింద దాదాపు 70 శాతం మంది పేదలు ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రుల్లోనే చికిత్సలు చేయించుకుంటున్నారు. 30 శాతం మందే ప్రభుత్వ ఆసుపత్రుల్లో చేరుతున్నారు. ప్రభుత్వం నుంచి 4 నెలలుగా ఆరోగ్యశ్రీకి నిధులు నిలిచిపోయాయి. దీంతో చాలాచోట్ల కార్పొరేట్ ఆసుపత్రులు ఆరోగ్యశ్రీ రోగులను చేర్చుకోవడానికి నిరాకరిస్తున్నాయి. లక్షలాదిమంది ఉద్యోగుల క్యాష్‌లెస్ వైద్యమూ ఆరోగ్యశ్రీ కిందకు వచ్చినందున వారి వైద్యానికి ప్రమాద ఘంటికలు మోగనున్నాయి. ఆరోగ్యశ్రీకి నేరుగా నిధులు! ప్రభుత్వం ఆరోగ్యశ్రీకి నిధులను నేరుగా విడుదల చేయడంలేదు. వైద్య విద్య సంచాలకుల (డీఎంఈ) కార్యాలయానికి నిధులు పంపించి అక్కడ ఆసుపత్రుల బిల్లులను పరిశీలించి ఆ తర్వాత విడుదల చేస్తున్నారు. అనంతరం సొమ్ము ఆసుపత్రులకు విడుదలవుతోంది. దీంతో జాప్యం జరుగుతోందన్న విమర్శలున్నాయి. ఈ నేపథ్యంలో ఆరోగ్యశ్రీకి నేరుగా నిధులు విడుదల చేయడానికి సంబంధించిన అంశం కూడా ఆర్థికశాఖ అధికారులతో జరిగిన చర్చల్లో ప్రస్తావనకు వచ్చినట్లు తెలిసింది. -
సిలిండర్లపై మధ్యాహ్న భోజనం: కేటీఆర్
సిరిసిల్ల: ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనాన్ని కట్టెల పొయ్యిలపై కాకుండా గ్యాస్ సిలిండర్లపై తయూరు చేయూలని, ఇందుకోసం అన్ని స్కూళ్లకు సిలిండర్లు అందిస్తామని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి కె. తారక రామారావు అన్నారు. కరీంనగర్ జిల్లా సిరిసిల్లలో పేద క్రైస్తవులకు దుస్తుల పంపిణీ, పేదలకు భూపట్టాల పంపిణీ కార్యక్రమం శనివారం జరిగింది. కార్యక్రమాల్లో మంత్రి మాట్లాడుతూ.. పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటల రాజేందర్ జిల్లావాసి అరుునందున ముందుగా ఇక్కడినుంచే మార్పునకు శ్రీకారం చుట్టాలన్నారు. అన్ని మతాలను గౌరవించే సంస్కారం టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఉందని, పండుగ పూట పేదలు ఇబ్బంది పడకుండా ఉండాలనే ఉద్దేశంతోనే బతుకమ్మ, రంజాన్, క్రిస్మస్ పండుగలకు చేయూతనందిస్తున్నామని చెప్పారు. -
‘కంది’పై సర్కారులో కదలిక!
సాక్షి, హైదరాబాద్: కందిపప్పు ధరల నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు సామాన్య వినియోగదారులకు పప్పు ధరలను అందుబాటులో ఉంచేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఒకవైపు అక్రమ వ్యాపారం, నిల్వలను కట్టడి చేస్తూ ధరలను అందుబాటులో ఉంచే మార్గాలపై దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా సోమవారం రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఈటల రాజేందర్, ఉన్నతాధికారులు, దాల్ మిల్లర్లు, వ్యాపారులతో సమావేశం కానున్నారు. ధరల నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై వారితో చర్చించి కార్యాచరణ రూపొందించనున్నారు. రాష్ట్రంలో ఏటా 1.93 లక్షల మెట్రిక్ టన్నుల కందిపప్పు అవసరమవుతుంది. అయితే ఇందులో అందుబాటులో ఉంటోంది కేవలం 80వేల మెట్రిక్ టన్నులు మాత్రమే. మిగతా అవసరాలకు పొరుగున ఉన్న మహారాష్ట్ర, కర్ణాటకలతో పాటు మయన్మార్, ఆఫ్రికా దేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. అయితే ప్రస్తుతం అంతర్జాతీయంగా ఏర్పడిన కొరత కారణంగా ధరలు విపరీతంగా పెరిగి కిలో కందిపప్పు ధర రూ.180కి చేరింది. ఈ నేపథ్యంలోనే ధరల నియంత్రణ చర్యలు చేపట్టిన కేంద్రం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. అక్రమ నిల్వలపై ఉక్కుపాదం మోపాలని రాష్ట్రాలను ఆదేశించింది. తనిఖీలు విసృ్తతం చేయాలని, ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేయాలని తన ఆదేశాల్లో పేర్కొంది. దీనిలో భాగంగానే రాష్ట్ర పౌర సరఫరాల శాఖ ఉన్నతాధికారులతో మంత్రి ఈటల సమావేశం ఏర్పాటు చేశారు. ధరల కట్టడి చర్యలపై వారితో సమీక్షించి నిర్ణయాలు తీసుకోనున్నారు. వీటితో పాటే సన్నబియ్యం సరఫరా, స్టేజ్-1, స్టేజ్-2 కాంట్రాక్టర్ల కమీషన్ పెంపు తదితర అంశాలపై కూడా చర్చించనున్నారు. మిల్లర్లతో మరో దఫా చర్చలు! సామాన్య ప్రజలకు తక్కువ ధరలో కందిపప్పు అందుబాటులో ఉండే విధంగా ప్రత్యేక కేంద్రాల ఏర్పాటుపై మంత్రి మరో దఫా దాల్ మిల్లర్లతో చర్చలు జరిపే అవకాశం ఉంది. ఇప్పటికే ఓమారు వారితో చర్చలు జరిపినా అవి ఫలప్రదం కాలేదు. బహిరంగ మార్కెట్లో ఎక్కువ ధరలకు కొనుగోలు చేసి వినియోగదారులకు తాము తక్కువ ధరకు విక్రయించలేమని మిల్లర్లు ప్రభుత్వానికి తేల్చిచెప్పారు. అయితే కేంద్ర ప్రభుత్వం తాజాగా రాష్ట్రాలు స్థానిక మిల్లర్లతో చర్చలు జరిపి ధరలను అందుబాటులోకి తేవాలని ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే రైతు బజార్లలో ప్రత్యేక కంది పప్పు కేంద్రాలు ఏర్పాటు చేసి విక్రయాలు చేపట్టే అంశంపై మంత్రి మిల్లర్లను ఒప్పించే అవకాశాలున్నాయి. నిజానికి రాష్ట్ర వ్యాప్తంగా మార్కెట్ యార్డుల్లో ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేయాల్సి ఉన్నా కేవలం 35 కేంద్రాలను మాత్రమే ఏర్పాటు చేశారు. వీటి ద్వారా విక్రయించిందికూడా తక్కువే. ఈ దృష్ట్యా సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండేలా మరిన్ని కేంద్రాల ఏర్పాటు, ధర సైతం కిలో రూ.100కు మించకుండా చూసే చర్యలపై వారితో చర్చించే అవకాశం ఉంది. -
పత్తి కొనుగోలులో సీసీఐ నిర్లక్ష్యం: ఈటల
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: రాష్ట్రంలో పత్తి కొనుగోలు కేంద్రాల ఏర్పాటు, జిన్నింగ్ మిల్లులతో ఒప్పందం వంటి అంశాల్లో సీసీఐ నిర్లక్ష్యంగా వ్యవహరించిందని రాష్ట్ర ఆర్థిక, పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటల రాజేందర్ వ్యాఖ్యానించారు. తక్షణమే అన్ని కేంద్రాలను ప్రారంభించి పత్తిని కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. 18 శాతం వరకు తేమ కలిగిన పత్తిని సైతం కొనుగోలు చేయాలని కోరారు. కనీస మద్దతు ధరను సైతం రూ.5 వేలకు పెంచాలన్నారు. ఈ అంశంపై మౌఖిక ఆదేశాలు కాకుండా రాతపూర్వక ఉత్తర్వులు జారీ చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. కరీంనగర్లో శనివారం రాత్రి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రభుత్వ చీఫ్‌విప్ కొప్పుల ఈశ్వర్, ఎంపీ బి.వినోద్‌కుమార్‌లతో కలిసి మాట్లాడారు. కరీంనగర్ జిల్లాలో 11 కేంద్రాలకు రెండు మూడు కేంద్రాల్లోనే పత్తి కొనుగోళ్లు జరుగుతున్నాయన్నారు. ఆయా కేంద్రాలకు రైతులు తీసుకొచ్చిన పత్తిని సైతం కొంతే సీసీఐ కొనుగోలు చేస్తుందన్నారు. మిగిలిన పత్తినంతా రూ.3,300 నుంచి రూ.3,500 ధరకు ప్రైవేటు వ్యాపారులే కొనుగోలు చేస్తున్నారని తెలిపారు. ఈ విషయంలో రైతులు కాస్త ఓపిక పట్టాలే తప్ప బ్రోకర్లకు తక్కువ ధరకు అమ్ముకోవద్దని సూచించారు. తెలంగాణలో ఆత్మహత్యల పరంపర కొనసాగుతున్న తరుణంలో కేంద్రం ముందుకొచ్చి సీసీఐ ద్వారా పత్తిని కొనుగోలు చేయించాల్సిన అవసరం ఉందన్నారు. లేనిపక్షంలో రైతులకు గిట్టుబాటు ధర వచ్చే అవకాశం లేదన్నారు. ఈ విషయంలో కేంద్రం స్పందించకపోతే ఏం చేయాలనే అంశంపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. రాష్ట్రంలో రైతులు పండించిన ధాన్యం, మొక్కజొన్నలను పూర్తిగా ప్రభుత్వమే మద్దతు ధర చెల్లించాలని నిర్ణయించామన్నారు. మార్క్‌ఫెడ్ ద్వారా మొక్కజొన్నలను, ఐకేపీ కేంద్రాలతోపాటు అవసరమైతే పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో ధాన్యాన్ని కొనుగోలు చేయనున్నట్లు చెప్పారు. -
కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తాం
♦ శాసనమండలిలో ఈటల హామీ ♦ ఔట్సోర్సింగ్ ఉద్యోగులతో ప్రభుత్వానికి సంబంధం లేదు ♦ నవంబర్ నాటికి కొత్త ఆహార భద్రతా కార్డుల జారీ సాక్షి, హైదరాబాద్: నిబంధనల ప్రకారం నియమితులైన కాంట్రాక్టు ఉద్యోగులందరినీ త్వరలో క్రమబద్ధీకరిస్తామని ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ హామీ ఇచ్చారు. శాసనమండలిలో మంగళవారం ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, సుధాకర్‌రెడ్డి, పూల రవీందర్, జనార్దన్, సయ్యద్ అల్తాఫ్ హైదర్ రజ్వీ, సయ్యద్ అమీనుల్ హసన్ జాఫ్రీ తదితరులు అడిగిన ప్రశ్నలకు ఈటల ఈ మేరకు బదులిచ్చారు. 1993 నుంచి ఇప్పటివరకు రోస్టర్, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం నియమితులైన 25,529 మంది కాంట్రాక్టు ఉద్యోగులను గుర్తించినట్లు మంత్రి తెలిపారు. కాంట్రాక్టు సిబ్బంది సర్వీసుల క్రమబద్ధీకరణను పరిశీలించేందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన అధికారుల కమిటీని నియమించినట్లు తెలిపారు. కోర్టు తీర్పులను దృష్టిలో ఉంచుకొని అనుసరించాల్సిన మార్గదర్శకాలపై కమిటీ కొన్ని సిఫార్సులు చేసిందన్నారు. ఏజెన్సీల ద్వారా, సిబ్బంది తక్కువగా ఉన్న శాఖలు అవసరాలకు అనుగుణంగా నియమించుకున్న ఔట్సోర్సింగ్ సిబ్బందితో ప్రభుత్వానికి సంబంధం లేదని ఈటల స్పష్టం చేశారు. రేషన్‌కార్డుల హేతుబద్ధీకరణ... రేషన్ దుకాణాల్లో అక్రమాలపై ఉక్కుపాదం మోపుతామని...రేషన్ కార్డుల హేతబద్ధీకరణ చేపడతామని ఈటల చెప్పారు. రేషన్ అక్రమాలను అరికట్టేందుకు డీలర్ల కమీషన్‌ను పెంచనున్నట్లు తెలిపారు. 20 శాతం వరకు బియ్యం పక్కదారి పడుతోందని...దీన్ని నివారించేందుకు రాష్ట్రవ్యాప్తంగా ఇ-పాస్ మిషన్లు ఏర్పాటు చేస్తామన్నారు. రంగారెడ్డి జిల్లాలో 54 వేల కార్డులను ప్రజలు స్వచ్ఛందంగా వెనక్కు ఇచ్చారన్నారు. ఆధార్ కార్డు లేదని ఏ ఒక్కరినీ తొలగించలేదని, సబ్సిడీ బియ్యానికి 2.82 కోట్ల మందిని అర్హులుగా గుర్తించామన్నారు. కొత్తగా ముద్రించిన ఆహార భద్రతా కార్డులను నవంబర్ నాటికి జారీ చేయాలని నిర్ణయించినట్లు ఈటల తెలిపారు. స్టీల్‌ప్లాంటు స్థాపనకు చర్యలు: హరీశ్ రాష్ట్రంలో స్టీల్ ప్లాంటు స్థాపనకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి హరీశ్‌రావు మండలిలో తెలిపారు. రాష్ట్రంలో స్టీల్ ప్లాం టును స్థాపించేందుకు గల సాధ్యాసాధ్యాలపై కేంద్ర ప్రభుత్వ ఉక్కుశాఖ టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసిందన్నారు. భారత భౌగోళిక సర్వే ప్రాథమిక గణాంకాల ప్రకారం రాష్ట్రంలో 302 మిలియన్ టన్నుల వివిధ గ్రేడ్ల ఇనుప ఖనిజం ఉందన్నారు. ప్లాంటు స్థాపనకు జీ-3 కేటగిరీలో 200 మిలియన్ టన్నుల నిక్షేపాలు సెయిల్‌కు తప్పనిసరిగా కావాల్సి ఉం టుందని, బయ్యారంలో పూర్తిస్థాయిలో అన్వేషణ జరుగుతోందన్నారు. జీ-3 కేటగిరీ తేవడానికి అంతర్జాతీయ బిడ్‌కు వెళ్లాలని నిర్ణయించినట్లు హరీష్‌రావు తెలిపారు. కంతనపల్లి బ్యారేజీ ఎత్తును మార్చే ప్రతిపాదనను ప్రభుత్వం పరిశీలిస్తుందని హరీశ్‌రావు మరో ప్రశ్నకు బదులిచ్చారు. బ్యారేజీ వల్ల 4 గ్రామాలు పూర్తిగా, 13 గ్రామాలు పాక్షికంగా ముంపునకు గురవుతాయని, దాన్ని తగ్గిం చేందుకే ఈ ఆలోచన చేస్తున్నామన్నారు. కాగా, వేములవాడలోని శ్రీరాజరాజేశ్వరస్వామి దేవాలయం పరిసర ప్రాంతాల సమగ్రాభివృద్ధికి తగిన సంస్థ ఏర్పాటును పరిశీలిస్తున్నామని దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి తెలిపారు. వచ్చే ఏడాది సమ్మక్క సారలమ్మ జాతరను, కృష్ణా పుష్కరాలను ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేస్తోందన్నారు. -
అసెంబ్లీలో జీరో అవర్
ఆలయ భూముల పరిరక్షణకు కమిటీ అర్చకులను ఆదుకుంటాం: మంత్రి ఈటెల హైదరాబాద్: ఆలయ భూముల పరిరక్షణకు కమిటీ వేస్తామని ఆర్థికశాఖ మంత్రి ఈటెల రాజేం దర్ ప్రకటించారు. శనివారం అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో టీడీపీ సభ్యుడు చల్లా ధర్మారెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు. తెలంగాణ ఉద్యమంలో పాలుపంచుకున్న అర్చకులను ఆదుకునేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి భరోసా ఇచ్చారు. ‘యాదగిరిగుట్ట అభివృద్ధికి బడ్జెట్లో రూ.100 కోట్లు కేటాయించాం. అర్చకులకు రూ.1500, ధూపదీప నైవేద్యాలకు రూ.1000 అందజేస్తున్నాం. అర్చకులు, ఉద్యోగుల సంక్షేమ నిధి ట్రస్టు కింద రూ.2 లక్షల మెడికల్ రీయింబర్స్మెంట్ చెల్లిస్తాం. వారి కుటుంబాల్లో జరిగే వివాహాలకు రూ.లక్ష రుణం అందిస్తాం. ఉపనయనానికి, పిల్లల చదువులకు రుణం, అయిదు వేల లోపు ఇంజనీరింగ్, రెండు వేల లోపు మెడిసిన్ ర్యాంక్ సాధించిన విద్యార్థులకు ప్రభుత్వమే ఫీజులు చెల్లిస్తుంది’ అని ప్రకటించారు.