కలెక్టరేట్ : జిల్లా పరిషత్ చైర్‌పర్సన్, వైస్ చైర్‌పర్సన్ ఎన్నికలు జూలై 4న, మున్సిపల్ చైర్‌పర్సన్, వైస్ చైర్‌పర్సన్‌ల ఎన్నికలు జూలై 3న జరుగుతాయని కలెక్టర్ జగన్ మోహన్ తెలిపారు. మంగళవారం సాయంత్రం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా, మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్‌ల ఎన్నికల నిర్వహణపై అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ జగన్‌మోహన్ మాట్లాడుతూ జెడ్పీ చైర్మన్ ఎన్నికలు పంచాయతీ రాజ్ యాక్టు ప్రకారం, మున్సిపల్ ఎన్నికలు మున్సిపల్ యాక్టు ప్రకారం ఎన్నికలు నిర్వహించాలన్నారు.
ముందుగా చైర్మన్ ఎన్నిక నిర్వహించిన అనంతరం వైస్ చైర్మన్ ఎన్నిక నిర్వహించాలన్నారు. ప్రత్యక్ష ఎన్నికల్లో కోరం తప్పనిసరిగా 50 శాతం ఉండాలని, కోరం లేని యెడల ఎన్నికను మరో రోజుకు వాయిదా వేయాలన్నారు. ఎన్నికల ప్రక్రియలో భాగంగా వీడియో చిత్రీకరణ తీయాలని సూచించారు. సంయుక్త కలెక్టర్ బి. లక్ష్మీకాంతం ప్రిసైడింగ్ అధికారులకు పలు సూచనలు అందించారు.
ఉదయం 10 గంటల వరకు నామినేషన్లు స్వీకరించాలని, అనంతరం పరిశీలన జరపాలని పేర్కొన్నారు. పరిశీలన అనంతరం వ్యాలిట్ నామినేషన్లు తెలియజేయాలన్నారు. ఒంటి గంటకు నామినేషన్ల ఉప సంహరణ ఉంటుందన్నారు. గైడ్‌లైన్స్ ప్రకారం ఎన్నికలు నిర్వహించాలని ప్రిసైడింగ్ అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ ప్రశాంత్ జీవన్, జిల్లా పరిషత్ సీఈవో అనితాగ్రేస్, డీఆర్వో ప్రసాదరావు, ఆర్డీవోలు సుధాకర్‌రెడ్డి, చక్రధర్ రావు, రామచంద్రయ్య, మున్సిపల్, ప్రిసైడింగ్ అధికారులు పాల్గొన్నారు.
4న జెడ్పీ చైర్‌పర్సన్ ఎన్నిక
Published Wed, Jul 2 2014 5:20 AM | Last Updated on Tue, Aug 14 2018 5:54 PM
Advertisement
Advertisement