
ఇదీ మన నాయకుల శ్రద్ధ..!
కరీంనగర్ : కరీంనగర్ జిల్లా సమస్యలపై జిల్లాపరిషత్ కార్యాలయంలో ఓ వైపు చర్చ జరుగుతుండగా మరోవైపు జెడ్పీటీసీ సభ్యులు ఇలా సెల్‌ఫోన్లలో మాట్లాడుతూ తమకేదీ పట్టదన్నట్లుగా కనిపించారు. మరికొందరేమో సెల్‌ఫోనే ప్రపంచం అన్నట్లుగా అస్తమానం ఫోన్‌లో ఆటలాడారు. కొందరు అధికారులేమో ఏమీ పట్టనట్లుగా హాయిగా కునుకు తీశారంటే పరిస్థితి ఏంటన్నది అర్థం చేసుకోవచ్చు. - సాక్షి ఫొటోగ్రాఫర్, కరీంనగర్