బీజింగ్: చైనాలో ఆయిల్ పైప్లైన్ పేలి భారీ ప్రమాదం సంభవించింది. తీర ప్రాంతమైన కిన్దావ్లో పెట్రోలియం పైప్లైన్ లీక్ కావడంతో దాదాపు 22 మంది మరణించగా, అధిక సంఖ్యలో గాయపడ్డారు.కాగా, ఎంత మంది గాయపడ్డారనేది అనేది మాత్రం బయటకు వెల్లడించలేదు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. ఈ ఘటన ఉదయం 10.30గం.లకు జరగగా, పైప్లైన్ లీకేజీ మాత్రం తెల్లవారుజామున 3.గంలకే ఆరంభమైంది. దీంతో పైప్లైన్ ను పూర్తిగా నిలిపివేశారు. పైప్ లైన్ లో చమురు ఒత్తిడి పెరిగడంతో ఈ దుర్ఘటన చోటు చేసుకున్నట్లు కిన్దావ్ ప్రభుత్వ కార్యాలయం వెల్లడించింది. ఈ ఘటన నేపధ్యంలో తీర ప్రాంతాల్లో ఉన్న పెట్రోలియం సైట్ లకు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించి విచారణ కొనసాగుతోంది.