బీహార్లో రైలు ఢీకొని 24 మంది మృతి | 24 run over by train in Bihar | Sakshi
Sakshi News home page

బీహార్లో రైలు ఢీకొని 24 మంది మృతి

Published Mon, Aug 19 2013 10:53 AM | Last Updated on Fri, Sep 1 2017 9:55 PM

బీహార్లో రైలు ఢీకొని 24 మంది మృతి

బీహార్లో రైలు ఢీకొని 24 మంది మృతి

బీహార్లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. దాదాపు 24 మంది భక్తులు రైలుచక్రాల కింద పడి నలిగి ప్రాణాలు కోల్పోయారు. సహార్సా నుంచి పాట్నా వెళ్లే రాజారాణి ఎక్స్ప్రెస్ ఈ దుర్ఘటనకు కారణమైంది. భమారా రైల్వే స్టేషన్ సమీపంలో సోమవారం తెల్లవారుజామున ఈ దుర్ఘటన జరిగింది.  దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన ప్రయాణికులు డ్రైవర్ను లాగి కొట్టడమే కాక, కొన్ని బోగీలకు నిప్పు పెట్టారు.

బాధితుల్లో చాలామంది కన్వారియాలు (శివభక్తులు). వీరు పట్టాల మీద నిలబడి ఉండగా, రాజారాణి ఎక్స్ప్రెస్ వేగంగా దూసుకొచ్చి వీరిని ఢీకొట్టింది. తూర్పు రైల్వే పరిధిలోని సమస్తిపూర్ డివిజన్లో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. భక్తులలో 12 మంది అక్కడికక్కడే మరణించారు. దుర్ఘటన జరిగిన తర్వాత కొంత దూరం వెళ్లి రైలు ఆగిపోయింది. ఈ ప్రమాదం ఫలితంగా ఆ మార్గంలో కొంత సేపటి పాటు రైళ్ల రాకపోకలు నిలిపివేసినట్లు రైల్వే శాఖ అధికారులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement