
గిన్నిస్‌లోకి సర్దుకుపోయారు...
కాస్త అలా సర్దుకో గురూ అని అంటూనే.. మొత్తం 51 మంది ఈ వ్యాన్‌లో సర్దుకుపోయారు. తద్వారా గిన్నిస్ బుక్‌లోకి ఎక్కారు. ఆదివారం బ్రిటన్‌లోని మాల్‌వెర్న్‌లో జరిగిన బస్‌ఫెస్ట్ వ్యాన్ ఫెస్టివల్‌లో 1974 నాటి వీడబ్ల్యూ కాంపర్‌వ్యాన్‌లో ఒకరి తర్వాత మరొకరు ఇలా 51 మంది సర్దుకోవడం ద్వారా ఈ విభాగంలో ప్రపంచ రికార్డును సాధించారు. దీంతోపాటు ఈ కార్యక్రమం ద్వారా ‘మేక్ ఎ విష్’ ఫౌండేషన్‌కు నిధుల సేకరణ కూడా చేశారు.