విడుదలైన వారిలో నిజామాబాద్ వాసి
రియాద్: వీసా ఉల్లంఘన కేసులో ఏడుగురు భారతీయ కార్మికులను అదుపులోకి తీసుకున్న సౌదీ అధికారులు గురువారం వారిని విడుదల చేశారు. ఇందులో నలుగురు శుక్రవారమే భారత్‌కు తిరిగి వెళ్లిపోయినట్లు స్థానిక మీడియా ఆదివారం తెలిపింది. ‘అధికారులు అరెస్టు చేసిన 22 మంది భార త కార్మికుల్లో ఏడుగురు మాత్రమే తిరిగి స్వదేశానికి రావడానికి అనుమతి లభించింది’ అని ఇక్కడ పనిచేస్తున్న భారత్‌కు చెందిన స్వచ్ఛంద కార్యకర్త అష్రాఫ్ కుట్చిల్ తెలిపారు. ఏడుగురిని విడుదల చేయడానికి ‘ఇండియన్ కల్చరల్ కాంగ్రెస్’ అపరాధ రుసుం కూడా చెల్లించిందని చెప్పారు. విడుదలైనవారిలో నిజాబాబాద్ జిల్లా వాసి మహ్మద్ షంషుద్దీన్ ఒకరు.