యూపీ మత ఘర్షణల్లో 9 మంది మృతి | 9 people including scribe dies in communal violence in Uttar pradesh | Sakshi
Sakshi News home page

యూపీ మత ఘర్షణల్లో 9 మంది మృతి

Published Sun, Sep 8 2013 3:30 AM | Last Updated on Fri, Sep 1 2017 10:32 PM

యూపీ మత ఘర్షణల్లో 9 మంది మృతి

యూపీ మత ఘర్షణల్లో 9 మంది మృతి

ముజఫర్‌నగర్/లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌లో చెలరేగిన మత ఘర్షణల్లో శనివారం ఒక టీవీ జర్నలిస్టు సహా తొమ్మిది మంది మృతి చెందారు. మరో 34 మంది గాయపడ్డారు. పరిస్థితి అదుపు తప్పడంతో ప్రభుత్వం కర్ఫ్యూ విధించి, సైన్యాన్ని రంగంలోకి దించింది. ముజఫర్‌నగర్ జిల్లా కావాల్ గ్రామంలో ఆగస్టు 27న ఒక వర్గానికి చెందిన ముగ్గురు వ్యక్తులు హత్యకు గురైన దరిమిలా జిల్లాలో ఘర్షణలు మొదలయ్యాయి. తాజాగా చెలరేగిన హింసాకాండలో మరణించిన వారిలో ఐబీఎన్7 చానల్ పార్ట్‌టైమ్ విలేకరి రాజేశ్ వర్మ, పోలీసులు కుదుర్చుకున్న ఒక ఫొటోగ్రాఫర్ కూడా ఉన్నారు. శాంతిభద్రతల ఐజీతో పాటు మీరట్, శహరణ్‌పూర్ ఐజీలు ముజఫర్‌నగర్‌లోనే ఉంటూ అక్కడి పరిస్థితిని సమీక్షిస్తున్నారని, ఐదు కంపెనీల పీఏసీ బలగాలను, ఆర్‌ఏఎఫ్, పోలీసు బలగాలను ఘర్షణలు జరిగిన ప్రాంతాల్లో మోహరించామని శాంతిభద్రతల అదనపు డీజీపీ అరుణ్ కుమార్ చెప్పారు. మృతుల కుటుం బాలకు రూ. 10 లక్షలు ఎక్స్‌గ్రేషియా ఇవ్వనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement