ఆగ్రా: ప్రేమకు జాతి, ఎల్లలు లేవని చాటి చెప్పిన ఓ జంట ప్రేమకథ ప్రేమ మందిరం తాజ్‌మహల్ సాక్షిగా విషాదాంతమైంది. ఆటోవాలా అయినా అంతరాలు ఆలోచించకుండా పెళ్లి చేసుకున్న అమెరికా అమ్మాయిని ఐదు నెలలైనా గడవకముందే అతడే కొట్టి చంపి ఆపై ఆత్మాహుతికి పాల్పడిన విషాద ఘటన ఆగ్రాలో గురువారం రాత్రి చోటుచేసుకుంది.
పోలీసుల కథనం ప్రకారం... బంటీ (32) ఓ ఆటోవాలా. గతేడాది జూలైలో ఆగ్రాకు వచ్చిన అమెరికా అమ్మాయి అరియన్ విలింగర్ (35) బంటీతో ప్రేమలో పడింది. ఇద్దరూ అక్టోబరు 11న పెళ్లి చేసుకుని కాపురం పెట్టారు. కానీ కొన్నాళ్లకే కలతలు రావడంతో ఇద్దరూ వేర్వేరుగా ఉండటం మొదలుపెట్టారు. ఇద్దరి మధ్యా గొడవలు పెరగడంతో అరియన్ టూరిజం పోలీసులకు ఫిర్యాదు చేసి ఫ్యామిలీ కోర్టులో కేసు వేసింది. దీంతో ఆమెపై కోపం పెంచుకున్న బంటీ గురువారం ఆమెను ఆటోలో ఓ నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి పొడిచి చంపాడు. తర్వాత తన గదికి వచ్చి ఆత్మాహుతి చేసుకున్నాడు.
ఆగ్రాలో ప్రేమకథ విషాదాంతం
Published Sat, Feb 22 2014 3:02 AM | Last Updated on Sat, Sep 2 2017 3:57 AM
Advertisement
Advertisement