రాయికోడ్(మెదక్): మెదక్ జిల్లా రాయికోడ్‌లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో బుధవారం ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని ఆరోగ్య మిత్రలు కొద్దిసేపు అడ్డుకున్నారు. ఈ శిబిరాన్ని వివిధ ప్రైవేట్ ఆస్పత్రులకు చెందిన ప్రతినిధులు ఏర్పాట్లు చేశారు. అయితే, సమస్యల పరిష్కారం కోసం సమ్మె చేస్తున్న ఆరోగ్య మిత్ర కార్యకర్తలు అక్కడికి చేరుకుని బైఠాయించారు. శిబిరాన్ని నిర్వహిస్తున్న డాక్టర్లు, సిబ్బందిని లోపలికి రాకుండా అడ్డుకున్నారు.
వారికి కాంగ్రెస్, టీడీపీ, సీపీఎం నాయకులు సంఘీభావం తెలిపి ఆందోళనలో పాల్గొన్నారు. ఆరోగ్య మిత్రల సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వ మొండి వైఖరి వీడాలని వారంతా నినదించారు. పోలీసులు రంగప్రవేశం చేసి వారిని అదుపులోకి తీసుకున్నారు. దీంతో వైద్య శిబిరం తిరిగి కొనసాగింది.
ఉచిత వైద్య శిబిరానికి ఆరోగ్యమిత్రల అంతరాయం
Published Wed, Aug 12 2015 3:33 PM | Last Updated on Sun, Sep 3 2017 7:19 AM
Advertisement