- అఖిల భారత సాంకేతిక విద్యాసంస్థల సమాఖ్య తీర్మానం
- సమాఖ్య ప్రధాన కార్యదర్శిగా కేవీకే రావు ఎన్నిక
సాక్షి, న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా ఇంజనీరింగ్ కళాశాలల్లో ప్రవేశాలకు ఒకే ప్రవేశ పరీక్ష నిర్వహణ, ఒకే సిలబస్‌కు మద్దతిస్తూ అఖిల భారత సాంకేతిక విద్యా సంస్థల సమాఖ్య తీర్మానం చేసింది. సమాఖ్య రెండో కార్యవర్గ సమావేశం ఆదివారం ఢిల్లీలో జరిగింది. ఈ సందర్భంగా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. సమాఖ్య చీఫ్ ప్యాట్రన్‌గా తమిళనాడుకు చెందిన ఆర్ ఎస్.మునిరత్నం, అధ్యక్షుడిగా పంజాబ్‌కు చెందిన అనుష్ కటారియా, ప్రధాన కార్యదర్శిగా తెలుగు రాష్ట్రాల సాంకేతిక విద్యా సంస్థల సంఘానికి చెందిన కేవీకే రావు, ఉపాధ్యక్షుడిగా ఆంధ్రా అసోసియేషన్‌కు చెందిన భూపాలం ఎన్నికయ్యారు. అనంతరం సమాఖ్య పలు తీర్మానాలు చేసింది. ఇంజనీరింగ్ విద్యలో ప్రవేశాలకు దేశ వ్యాప్తంగా ఒకే ప్రవేశపరీక్షను, ఒకే సిలబస్‌ను త్వరగా ప్రవేశపెట్టాలని కేంద్రాన్ని కోరారు. ప్రధాన కార్యదర్శి కేవీకే రావు మాట్లాడుతూ.. సాంకేతిక విద్యలో విద్యార్థుల నైపుణ్యాలను పెంచే విధంగా సాంకేతిక విద్యామండలి సంస్కరణలు ప్రవేశపెట్టాలని కోరారు.
'ఇంజనీరింగ్‌లో ఒకే ప్రవేశ పరీక్ష’కు మద్దతు
Published Mon, Mar 20 2017 2:39 AM | Last Updated on Fri, Aug 17 2018 6:05 PM
Advertisement