పసిబిడ్డను పొయ్యిలోకి విసిరేసిన తండ్రి | Alcoholic father kills infant son | Sakshi
Sakshi News home page

పసిబిడ్డను పొయ్యిలోకి విసిరేసిన తండ్రి

Published Fri, Dec 20 2013 6:11 PM | Last Updated on Fri, Aug 17 2018 7:48 PM

Alcoholic father kills infant son

రాయ్గఢ్: కన్న బిడ్డను అతి కిరాతకంగా హతమార్చాడో తండ్రి. భార్య భర్తల మధ్య వైరం కాస్తా అభం శుభం తెలియని పసికందు ప్రాణాలు తీసింది. అసియా రామ్ రాథియా(45) అనే వ్యక్తి మద్యం తాగి భార్య రాస్ కున్వార్ తో తరచు ఘర్షణకు దిగేవాడు. ఈ క్రమంలోనే గురువారం రాత్రి మద్యం బాగా సేవించి వచ్చిన రాథియా  తిరిగి భార్యతో గొడవ పడ్డాడు. మద్యం మత్తుతో విచక్షణ కోల్పోయిన అతను పేగు బంధాన్ని కూడా మరిచిపోయాడు. అక్కడే ఉన్న ఏడు నెలల పసిగుడ్డును పొయ్యిలోకి విసేరేయడంతో ఆ చిన్నారి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. దీంతో అక్కడికి చేరుకున్న స్థానికులు అతనికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు.

 

రాథియాను అదుపులోకి తీసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బాగా కాలిన గాయాలతో ప్రాణాలు కోల్పోయిన ఆ చిన్నారిని పోస్ట్మార్టంకు తరలించామని ఎస్పీ రాహుల్ భాగత్ తెలిపారు. కాగా,  గతంలో మాజీ భార్యను హత్య చేసిన ఘటనలో అసియా మూడు సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించాడని ఎస్పీ తెలిపారు.. అనంతరం రెండు సంవత్సరాల క్రితం రాస్ కున్వార్ పెళ్లి చేసుకున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement