ఇక గంటలో అమెజాన్ మందు సేవలు
న్యూఢిల్లీ: ఇప్పటికే వేగవంతమైన సేవలను అందిస్తూ ప్రపంచంలోనే దూసుకెళ్తున్న ఈ వాణిజ్య సంస్థ అమెజాన్ మరో వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఆర్డర్ చేసిన గంటలోపే ఇంటి ముందుకు బీరు, వైన్, లిక్కర్లాంటి మత్తుపానియాలు అందించనుంది. ప్రైం నౌ సర్వీస్ పేరిట ఈ సర్వీసులను అమెజాన్ కొత్తగా ప్రారంభించింది.
ఇప్పటికే ఈ పద్ధతిని ప్రారంభించిన అమెజాన్ తాజాగా అమెరికాలో ఈ సర్వీసును ప్రారంభించింది. ప్రారంభించిన క్షణాల్లోనే ఈ విధానానికి ఆధరణ పెరిగిందని, ఈ కామర్స్ ద్వారా మద్యం కొనుగోలుచేసేవారి సంఖ్య అమాంతం పెరిగిందని అమెజాన్ సంస్థ నిర్వాహకులు తెలిపారు. త్వరలోనే ఒక్కొక్కటిగా వివిధ దేశాలకు ఈ సర్వీసులను విస్తరింపజేయాలనుకుంటున్నారు.