రవాణాశాఖ యోచన
సాక్షి, హైదరాబాద్: మహబూబ్‌నగర్ బస్సు దుర్ఘటన నేపథ్యంలో అతివేగంగా ప్రయాణించే బస్సులకు సంబంధించి డ్రైవింగ్ నిబంధనల్లో మార్పు చేయాలని రవాణా శాఖ భావిస్తోంది. ప్రస్తుతం బస్సులన్నింటికీ ఒకే తరహా డ్రైవింగ్ లెసైన్స్ విధానం అమలు చేస్తున్నారు. కానీ, గతే డాది 32 మందిని బలిగొన్న కాళేశ్వరి ట్రావెల్స్ బస్సు, ఇప్పుడు 45 మంది మృతికి కారణమైన బస్సు.. రెండూ ‘వోల్వో’ బస్సులే. అత్యంత వేగంగా ప్రయాణించగలిగే ఈ తరహా బస్సుల్ని ప్రత్యేక నైపుణ్యం ఉన్నవారే అదుపు చేసే అవకాశముంటుంది. కానీ సరైన శిక్షణ లేనివారు కూడా వాటిని నడుపుతూ.. ప్రమాదాలకు కారణమవుతున్నారు.
అలాంటి వాటి డ్రైవర్లకు ప్రమాదకర పదార్థాలను తరలించే వాహనాలకు జారీ చేసే లెసైన్స్ విధానం వర్తింప చేయాలని రవాణా శాఖ భావిస్తోంది. ఈ లెసైన్స్‌లను ఏడాదికోసారి రెన్యూవల్ చేయించుకోవాల్సి ఉంటుంది. అదే సమయంలో డ్రైవర్లకు నైపుణ్య పరీక్ష నిర్వహిస్తా రు. అందులో సఫలమైతేనే రెన్యువల్ చేస్తారు. మరోవైపు ‘వోల్వో’ తరహా బస్సుల్లో.. ఏదైనా ప్రమాదాన్ని ఎదుర్కొనే పరిస్థితి వస్తే ముందస్తుగా హెచ్చరించే పరిజ్ఞానమూ కొత్త బస్సుల్లో ఉం టోంది. వాటిపై డ్రైవర్లకు అవగాహన ఉందని ధ్రువీకరించుకున్నాకే లెసైన్సులు రెన్యూవల్ చేయాల్సి ఉంటుంది. కాగా.. ఆర్టీసీలో ‘వోల్వో’ తరహా బస్సులు నడిపే డ్రైవర్లకు ఇస్తున్న తరహాలోనే ప్రైవేటు ట్రావెల్స్‌కు చెందిన డ్రైవర్లకు శిక్షణ ఇప్పించే బాధ్యతను ప్రభుత్వం తీసుకోవాలని సిఫారసు చేయాలని ఆలోచిస్తున్నారు.
‘వోల్వో’ డ్రైవర్లకు ప్రత్యేక లెసైన్స్..?
Published Sat, Nov 2 2013 2:21 AM | Last Updated on Sat, Sep 29 2018 5:26 PM
Advertisement