Bus fire accident case
-
మహారాష్ట్రలో ఘోర ప్రమాదం
నాగ్‌పూర్: డ్రైవర్ తప్పిదం 25 నిండు ప్రాణాలను బలి తీసుకుంది. వేగంగా వెళ్తున్న ప్రైవేట్ స్లీపర్ కోచ్ బస్సు, విద్యుత్ స్తంభాన్ని, ఆపై డివైడర్‌ను ఢీకొట్టి పడిపోవడంతో మంటలు చెలరేగాయి. గాఢ నిద్రలో ఉన్న ప్రయాణికులు 25 మంది మంటల్లో సజీవ దహనమయ్యారు. బస్సు డ్రైవర్, క్లీనర్ మరో ఆరుగురు ప్రయాణికులు కిటికీ అద్దాలు పగులగొట్టుకుని బయటపడ్డారు. మహారాష్ట్రలోని బుల్దానా జిల్లాలో సమృద్ధి ఎక్స్‌ప్రెస్‌వేపై శుక్రవారం అర్ధరాత్రి దాటాక ఈ ఘోరం చోటుచేసుకుంది. ఘటనపై రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధానమంత్రి మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విదర్భ ప్రైవేట్ ట్రావెల్స్‌కు చెందిన స్లీపర్ కోచ్ బస్సు శుక్రవారం సాయంత్రం 4 గంటల సమయంలో పుణె నుంచి నాగ్‌పూర్‌కు 33 మందితో బయలుదేరింది. యావత్మాల్ జిల్లా కరంజా వద్ద భోజనం కోసం ఆగింది. ఆ తర్వాత సిండ్ఖెద్రజాకు సమీపంలోని పింపల్ఖుటా గ్రామం వద్ద 1.30 గంటల సమయంలో ప్రమాదానికి గురైందని బుల్దానా ఎస్పీ సునీల్ కడాస్నే చెప్పారు. బస్సు రోడ్డు కుడి పక్కన ఇనుప స్తంభాన్ని, ఆపై డివైడర్‌ను ఢీకొట్టి కుడివైపునకు అంటే ఎంట్రీ డోర్ పైవైపు ఉండేలా పడిపోయింది. డీజిల్ ట్యాంక్ పగిలి మంటలు చెలరేగాయి. క్షణాల్లో బస్సు అంతటికీ వ్యాపించాయి. ‘ఈ ఘటనకు డ్రైవర్ తప్పిదమే కారణమని భావిస్తున్నాం. నిద్రమత్తులో ఉండటం వల్లే బస్సు అదుపు తప్పి ప్రమాదానికి గురైనట్లు కనిపిస్తోంది. డ్రైవర్ చెబుతున్న విధంగా ఘటనకు టైర్ పేలడం కారణం కాదు. అందుకు తగిన ఆధారాలేవీ రోడ్డుపై కనిపించలేదు’ అని అమరావతి రీజినల్ ట్రాన్స్పోర్ట్ కార్యాలయంతెలిపింది. పోలీసులు డ్రైవర్‌పై కేసు నమోదు చేశారు. వాహనదారులు సాయం చేసుంటే.. బస్సు కిటికీ అద్దాలు పగులగొట్టి బయటకు వచి్చన ప్రయాణికులు తమ అనుభవాలను వివరించారు. బస్సు నుంచి బయటపడ్డాక అటుగా వెళ్తున్న వాహనదారులను మంటల్లో చిక్కుకున్న వారిని కాపాడాలని కోరామన్నారు. ఎవరూ పట్టించుకోలేదని, ఆగకుండానే వెళ్లిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎవరైనా స్పందించి ఉంటే కొన్ని ప్రాణాలనైనా కాపాడి ఉండేవారమని చెప్పారు. మంటలు ఎగిసిపడుతుండటంతో అందులో చిక్కుకున్న ప్రయాణికులను కాపాడలేక నిస్సహాయతతో చూస్తుండి పోవాల్సి వచి్చందని సమీప గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. మృతదేహాలను బుల్దానా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కుటుంబసభ్యులు గుర్తుపడితే వారికి అప్పగిస్తాం. లేనిపక్షంలో డీఎన్ఏ పరీక్షలు జరిపిస్తామని అధికారులు అన్నారు. సీఎం ఏక్నాథ్ షిండే, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఘటనాస్థలిని సందర్శించారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. Maharashtra | At least 25 people feared dead and several injured after a bus carrying 32 passengers burst into flames on Samruddhi Mahamarg expressway in Buldhana. The injured are being shifted to Buldhana Civil Hospital: Dy SP Baburao Mahamuni, Buldhana (Warning: Disturbing… pic.twitter.com/NLo8pcqpz3 — ANI (@ANI) July 1, 2023 ఇది కూడా చదవండి: యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు మృతి -
‘వోల్వో’ డ్రైవర్లకు ప్రత్యేక లెసైన్స్..?
రవాణాశాఖ యోచన సాక్షి, హైదరాబాద్: మహబూబ్‌నగర్ బస్సు దుర్ఘటన నేపథ్యంలో అతివేగంగా ప్రయాణించే బస్సులకు సంబంధించి డ్రైవింగ్ నిబంధనల్లో మార్పు చేయాలని రవాణా శాఖ భావిస్తోంది. ప్రస్తుతం బస్సులన్నింటికీ ఒకే తరహా డ్రైవింగ్ లెసైన్స్ విధానం అమలు చేస్తున్నారు. కానీ, గతే డాది 32 మందిని బలిగొన్న కాళేశ్వరి ట్రావెల్స్ బస్సు, ఇప్పుడు 45 మంది మృతికి కారణమైన బస్సు.. రెండూ ‘వోల్వో’ బస్సులే. అత్యంత వేగంగా ప్రయాణించగలిగే ఈ తరహా బస్సుల్ని ప్రత్యేక నైపుణ్యం ఉన్నవారే అదుపు చేసే అవకాశముంటుంది. కానీ సరైన శిక్షణ లేనివారు కూడా వాటిని నడుపుతూ.. ప్రమాదాలకు కారణమవుతున్నారు. అలాంటి వాటి డ్రైవర్లకు ప్రమాదకర పదార్థాలను తరలించే వాహనాలకు జారీ చేసే లెసైన్స్ విధానం వర్తింప చేయాలని రవాణా శాఖ భావిస్తోంది. ఈ లెసైన్స్‌లను ఏడాదికోసారి రెన్యూవల్ చేయించుకోవాల్సి ఉంటుంది. అదే సమయంలో డ్రైవర్లకు నైపుణ్య పరీక్ష నిర్వహిస్తా రు. అందులో సఫలమైతేనే రెన్యువల్ చేస్తారు. మరోవైపు ‘వోల్వో’ తరహా బస్సుల్లో.. ఏదైనా ప్రమాదాన్ని ఎదుర్కొనే పరిస్థితి వస్తే ముందస్తుగా హెచ్చరించే పరిజ్ఞానమూ కొత్త బస్సుల్లో ఉం టోంది. వాటిపై డ్రైవర్లకు అవగాహన ఉందని ధ్రువీకరించుకున్నాకే లెసైన్సులు రెన్యూవల్ చేయాల్సి ఉంటుంది. కాగా.. ఆర్టీసీలో ‘వోల్వో’ తరహా బస్సులు నడిపే డ్రైవర్లకు ఇస్తున్న తరహాలోనే ప్రైవేటు ట్రావెల్స్‌కు చెందిన డ్రైవర్లకు శిక్షణ ఇప్పించే బాధ్యతను ప్రభుత్వం తీసుకోవాలని సిఫారసు చేయాలని ఆలోచిస్తున్నారు. -
బస్సు దుర్ఘటనపై సీఐడీ దర్యాప్తు
సాక్షి, హైదరాబాద్: మహబూబ్‌నగర్ జిల్లా పాలెం వద్ద 45 మందిని బలిగొన్న ఘోర దుర్ఘటనపై సీఐడీ విచారణకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. బస్సు ప్రమాదానికి కారణాలు, బాధ్యులను గుర్తించడంతోపాటు బస్సు యజమాన్యం నిబంధనలను అతిక్రమించిన తీరుపై పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలని కోరింది. బస్సు దుర్ఘటనపై సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి శుక్రవారం క్యాంపు కార్యాలయంలో సమీక్షించారు. రవాణా మంత్రి బొత్స సత్యనారాయణ, సీఎస్ పి.కె.మహంతి, రవాణా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి లక్ష్మీ పార్థసారథి, డీజీపీ ప్రసాదరావు, ఆర్టీసీ ఎండీ ఏకేఖాన్, రవాణా శాఖ కమిషనర్ అనంతరాము, మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టర్ గిరిజా శంకర్ తదితరులు పాల్గొన్నారు. ప్రమాదం తీరు, ప్రాథమికంగా నిర్ధారించిన కారణాలను సీఎం అధికారులనడిగి తెలుసుకున్నారు. ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు పటిష్ట చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని సీఎం అభిప్రాయపడ్డారు. గతేడాది షిర్డీకి వెళ్తున్న కాళేశ్వరి ట్రావెల్స్ బస్సు బ్రిడ్జిపై నుంచి పడిపోయి 32 మంది మృతి చెందిన ఘటనలో, తాజా దుర్ఘటనలో ఉన్నవి వోల్వో బస్సులే కావటంతో.. కారణాలను పూర్తిగా తెలుసుకోవాల్సి ఉన్నం దున సీఐడీ విచారణ అవసరమన్నారు. ఈ మేరకు సీఐడీ విచారణకు ఆదేశించి, వీలైనంత త్వరగా నివేదిక ఇవ్వాలని సూచించారు. భవిష్యత్తులో ఇలాంటి ఘోర దుర్ఘటనలు జరగకుండా తీసుకోవాల్సిన చర్యలపై సిఫారసు చేసేందుకు మరో అత్యున్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అందులో ఐఏఎస్ అధికారులతో పాటు ఆటోమొబైల్, ఇంధనశాఖ ఇంజనీర్లకు చోటు కల్పించాలన్నారు. బుధవారం నాటి దుర్ఘటనలో.. నిమిషాల వ్యవధిలోనే వోల్వో బస్సు బుగ్గిగా మారటం, ప్రయాణికులు బయటకు వచ్చేందుకు ప్రయత్నించినా తలుపులు తెరుచుకోకపోవటం, అత్యవసర ద్వారాలను వారు ఉపయోగించుకోలేకపోవటం.. తదితర ప్రశ్నలకు జవాబులు దొరకాల్సిన అవసరం ఉందని సమావేశం భావించింది. డీఎన్ఏ పరీక్షలను త్వరగా పూర్తిచేసి, వారం రోజుల్లో మృతదేహాలను బంధువులకు అందజేయాలని సీఎం ఆదేశించారు.