'వాజపేయికి భారతరత్న ఎలా ఇస్తారు' | Asaduddin Owaisi questions Bharat Ratna to Atal Bihari Vajpayee | Sakshi
Sakshi News home page

'వాజపేయికి భారతరత్న ఎలా ఇస్తారు'

Published Mon, May 4 2015 6:33 PM | Last Updated on Sun, Sep 3 2017 1:25 AM

'వాజపేయికి భారతరత్న ఎలా ఇస్తారు'

'వాజపేయికి భారతరత్న ఎలా ఇస్తారు'

న్యూఢిల్లీ: బీజేపీ సీనియర్ నాయకుడు, మాజీ ప్రధాని అటల్ బిహారి వాజపేయికి దేశ అత్యున్నత పురస్కారం భారతరత్న ప్రదానం చేయడంపై ఎంఐఎం నాయకుడు అసదుద్దీన్ ఒవైసీ అభ్యంతరం వ్యక్తం చేశారు. బాబ్రీ మసీదు కూల్చివేతలో ఆరోపణలు ఎదుర్కొంటున్న వాజపేయికి భారతరత్న ఎలా ఇస్తారని ఆయన ప్రశ్నించారు. మార్చి 27న రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ స్వయంగా వాజపేయి నివాసానికి వెళ్లి భారతరత్న ప్రదానం చేసిన సంగతి తెలిసిందే.

బీజేపీ కురువృద్ధుడు ఎల్ కే అద్వానీకి పద్మ విభూషణ్ పురస్కారం ప్రదానం చేయడాన్ని అసదుద్దీన్ ప్రశ్నించారు. అయితే ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఎంఐఎం సిద్ధమవుతున్న నేపథ్యంలో ఆయనీ అభ్యంతరాలు వ్యక్తం చేయడం గమనార్హం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement