18 రోజుల పసికూనతో బాహుబలి ప్రభంజనం.. | Baby Akshara who plays key role in Bahubali series | Sakshi
Sakshi News home page

18 రోజుల పసికూనతో బాహుబలి ప్రభంజనం..

Published Wed, May 3 2017 5:40 PM | Last Updated on Tue, Sep 5 2017 10:19 AM

Baby Akshara who plays key role in Bahubali series


ఫస్ట్ లుక్ లోనే ప్రేక్షకులను మెస్మరైజ్ చేసిన బాహుబలి.. భారతీయ సినీ చరిత్రలోనే ఆల్ టైమ్ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. ఐదేళ్ల కిందట విడుదలైన బాహుబలి ఫస్ట్ లుక్ లో.. శివగామి(రమ్యకృష్ణ) చేతిలో పొద్దికగా ఒదిగి, భవిష్యత్తును శాసించబోతున్నంత ఎక్స్ ప్రెషన్ ఇచ్చిన ఆ పసికూన గురించిన సమాచారం ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ప్రభాస్ కాకుండా ఈ సినిమాలో ద్విపాత్రాభినయం చేసిన ఒకేఒకరు ఈ పసికునే కావడం మరో విశేషం!

బాహుబలి: ది బిగినింగ్ లో శివగామి.. మహేంద్ర బాహుబలి (శివుడు)ని ఎత్తుకుని నదిలో ఉన్నప్పుడు చూపించింది, ఆ తరువాత ఫ్లాష్ బ్యాక్ లో అమరేంద్ర బాహుబలిగా శివగామి చేతి వేలిని పట్టుకున్నప్పుడు చూపించింది, బాహుబలి:కన్ క్లూజన్ లో వచ్చే ఫ్లాష్ బ్యాక్ సీన్లలో.. మహేంద్ర బాహుబలిగా శివగామి పసికందును ప్రజలకు చూపించింది, కట్టప్ప తన తలపై కాలును పెట్టుకున్నప్పుడు చూపించిన పసికందునే! అయితే ఈ బుజ్జాయి నిజానికి అబ్బాయి కాదు.. అమ్మాయి! పేరు అక్షర! బాహుబలిలో నటించే సమాయానికి అక్షర వయసు జస్ట్ 18 రోజులు మాత్రమే! ఇంతకీ ఈమెకు బాహుబలిలోకి ఎలా తీసకున్నారంటే..

కేరళలోని అతురపల్లి జలపాతాల  దగ్గర బాహుబలి షూటింగ్ జరిగినప్పుడు స్థానికుడైన వల్సన్ అనే ఓ ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ ఆ సినిమాకు పనిచేశాడు. ఆ సమయంలోనే వల్సన్ దంపతులకు అక్షర జన్మించింది. బాహుబలి ప్రొడక్షన్ లో కీలక పాత్రపోశించిన శ్రీవల్లి ద్వారా ఆ పాప గురించి దర్శకుడు రాజమౌళికి తెలిసింది. నిజానికి అమరేంద్ర బాహుబలి, మహేంద్ర బాహుబలి పాత్రలు పసికందులుగా చూపించేటప్పుడు గ్రాఫిక్స్ ను వినియోగించాలని అనుకున్న జక్కన్న.. అక్షరను చూశాక మనసుమార్చుకున్నాడు. అలా ఆమె సినిమాలో కాలుమోపడం, ఫస్ట్ లుక్ లోనే ప్రభంజనం సృష్టించడం, ఆ తర్వాతి విషయాలు తెలిసినవే. కాగా, ప్రస్తుతం కేరళలోనే చదువుకుంటున్న అక్షర వేసవి సెలవుల్ని ఎంజాయ్ చేస్తోంది..






Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement