ఆగ్రా: 'లవ్ జిహాద్'కు పోటీగా బజరంగ్ దళ్ బహు లావో, బేటీ బచావో(కోడల్ని తెచ్చుకోండి, ఆడపిల్లను కాపాడండి) ప్రచారం ప్రారంభించింది. దీనికి సంబంధించిన కరపత్రాలను ఆగ్రాలోని పాఠశాలల వెలుపలి బజరంగ్ దళ్ కార్యకర్తలు పంచిపెట్టారు. 'లవ్ జిహాద్' పట్ల అప్రమత్తంగా ఉండాలని అందులో పేర్కొన్నారు.
తర్వాత దశలో మహిళా కాలేజీలకు వెళ్లి ప్రచారం చేస్తామని బజరంగ్ దళ్ యూపీ కన్వీనర్ అవనీంద్ర సింగ్ తెలిపారు. ఇతర మతాలను యువతులను కోడళ్లుగా తెచ్చుకున్నా తమకు అభ్యంతరం లేదన్నారు. దీని ద్వారా తమ మతంలోని గొప్పతనాన్ని తెలుసుకునేందుకు హిందూ కుటుంబాలు అవకాశం ఇస్తున్నాయని చెప్పారు. 'లవ్ జిహాద్'ను అడ్డుకునేందుకే 'బహు లావో, బేటీ బచావో' ప్రచారం చేస్తున్నామని తెలిపారు.
'లవ్ జిహాద్'కు పోటీగా కోడల్ని తెచ్చుకోండి
Published Tue, Jul 21 2015 7:06 PM | Last Updated on Sun, Sep 3 2017 5:54 AM
Advertisement
Advertisement