డ్రంకన్ డ్రైవ్ లో దొరికిన టీవీ నటుడు | 'Balika Vadhu' star Siddharth Shukla fined for drunken driving | Sakshi
Sakshi News home page

డ్రంకన్ డ్రైవ్ లో దొరికిన టీవీ నటుడు

Published Thu, Jan 1 2015 11:00 PM | Last Updated on Fri, May 25 2018 2:06 PM

డ్రంకన్ డ్రైవ్ లో దొరికిన టీవీ నటుడు - Sakshi

డ్రంకన్ డ్రైవ్ లో దొరికిన టీవీ నటుడు

ముంబై: ప్రముఖ టీవీ నటుడు, 'బాలికా వధు' ఫేం సిద్దార్థ శుక్లా డ్రంకన్ డ్రైవ్ లో పట్టుబడ్డాడు. గురువారం తెల్లవారుజామున 3.30 గంటల ప్రాంతంలో తాగి కారు నడుపుతూ అతడు ట్రాఫిక్ పోలీసులకు దొరికాడు. నూతన సంవత్సర వేడుకలకు హాట్ స్పాట్ అయిన జూహు బీచ్ వెళుతుండగా అతడిని పట్టుకున్నారు.

సిద్దార్థ శుక్లా ఒక్కడే కారు నడుపుకుంటూ వెళుతున్నాడని, ఆ సమయంలో అతడు మద్యం మత్తులో ఉన్నాడని పోలీసులు తెలిపారు. అతడిపై కేసు నమోదు చేసి రూ. 2000 జరిమానా విధించారు. అతడి డ్రైవింగ్ లైసెన్స్ ను డీఎన్ నగర్ ట్రాఫిక్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement