‘బెంగళూరు-నాందేడ్’ రైలు ప్రమాదంపై ప్రాథమిక నివేదిక
సాక్షి, బెంగళూరు : అనంతపురం జిల్లా కొత్తచెరువు సమీపంలో గత నెల 28న బెంగళూరు-నాందేడ్ ఎక్స్‌ప్రెస్‌రైలులోని బీ1 బోగీలో జరిగిన అగ్ని ప్రమాదానికి మానవ తప్పిదమే కారణమని తేలింది. ఈ ప్రమాదంలో 26 మంది మరణించిన సంగతి తెలిసిందే. ఈ సంఘటనపై దర్యాప్తు చేపట్టిన దక్షిణ సర్కిల్ రైల్వే సేఫ్టీ కమిషనర్ సతీశ్ కుమార్ మిట్టల్ ఈ మేరకు ప్రాథమిక నివేదికను లక్నోలోని రైల్వే సేఫ్టీ చీఫ్ కమిషనర్‌కు పంపారు. నివేదికలో పేర్కొన్న వివరాలు..
అపరిచిత ప్రయాణికుడి నిర్లక్ష్యమే ఈ ప్రమాదానికి కారణం.
విద్యుత్ సరఫరా వ్యవస్థలన్నిటికీ రక్షణ సౌలభ్యాలు ఉన్నందున, షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం జరిగిందనడానికి ఎలాంటి ఆధారాలు లేవు.
హైదరాబాద్‌లోని ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ సమర్పించిన ప్రాథమిక నివేదిక ప్రకారం దగ్ధమైన బోగీలో పేలుడు జరిగిన ఆనవాళ్లు లేవు. ఈ సంఘటన వెనుక కుట్ర కోణం దాగి ఉందనడానికి కూడా సరైన ఆధారాలు లేవు.
బోగీ నుంచి రైల్వే పోలీసులు సేకరించిన వస్తువుల్లో మద్యం క్వార్టర్ బాటిల్, బీడీలు, అగ్గిపెట్టె, దగ్ధమైన ఎలక్ట్రిక్ ఐరన్ బాక్స్‌లు లభించాయి.
ఆ ఘోరం.. మానవ తప్పిదమే
Published Thu, Jan 30 2014 1:10 AM | Last Updated on Wed, Sep 5 2018 9:45 PM
Advertisement
Advertisement