బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ సంచలన నిర్ణయం
లండన్ : బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ సంచలన నిర్ణయం తీసుకుంది. పాలసీ సమీక్ష నిర్వహించిన ఇంగ్లండ్ కేంద్ర బ్యాంకు వడ్డీ రేటులో 0.25 శాతం మేర కోత పెట్టింది. దీంతో ప్రామాణిక వడ్డీ రేటు 0.25 శాతానికి చేరింది. సహాయక ప్యాకేజీకింద 10 బిలియన్ పౌండ్లతో యూకే కార్పొరేట్ బాండ్లను కొనుగోలు చేసేందుకు నిర్ణయించినట్టు గురువారం వెల్లడించింది. మానిటరీ పాలసీ రివ్యూ నిర్వహించిన బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ గవర్నర్ మార్క్ కార్నేఈ వివరాలను ప్రకటించారు.
సుదీర్ఘ కాలం తరువాత 2009 తరువాత మొట్టమొదటి సారి వడ్డీ రేట్లు కట్ చేసింది. మార్కెట్ అంచనాలను అనుగుణంగా తన ముఖ్య లెండింగ్ రేటు తగ్గించింది. వడ్డీరేట్లను0.5 శాతం నుంచి 0.25 శాతానికి తగ్గించింది. బ్రిటన్ ఆర్థిక వ్యవస్థ 2016 సం.రంలో ఆర్థిక స్థిరంగా ఉంటుందని, అయితే వచ్చే ఏడాదంతా బలహీనమైన వృద్ధి ఉండనుందని సెంట్రల్ బ్యాంక్ వ్యాఖ్యానించింది. దీంతోపాటు యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ వైదొలగిన పరిణామాలనుంచి బయటపడడానికి 60 బిలియన్ పౌండ్ల ప్రభుత్వం రుణం కొనుగోలు చేయనున్నట్టు చెప్పింది.
జూన్ 23 బ్రెగ్జిట్ పరిణామంతో స్టెర్లింగ్ పౌండ్ విలువ భారీ పతనం, గణనీయింగా పెరిగిన ద్రవ్యోల్బణం కారణాలతో ఈ నిర్ణయం తీసుకుంది. దీంతోపాటుగా కొన్ని కొత్త పథకాలను ప్రకటించింది. బ్యాంకుల స్థిరీకరణ కోసం వంద బిలియన్ పౌండ్లు, పది బిలియన్ పౌండ్ల కార్పొరేట్ బాండ్ల కొనుగోలు తదితర అంశాలను ప్రకటించింది.
కాగా ఆర్థిక వేత్తల సహా, పోర్బ్స్ కూడా కార్పొరేట్ రుణ కొనుగోళ్లకు వ్యతిరేకంగా స్పందించారు. 2009 సం.రం తరువాత మొట్టమొదటి వడ్డీరేట్లలో కోత పెట్టిందని మార్కెట్ వర్గాలు తెలిపాయి. మరోవైపు కేంద్ర బ్యాంక్ ప్రకటనతో పౌండ్ విలువమరింత క్షీణించింది. ఒక శాతానికిపైగా నష్టపోయింది.