బిగ్‌బాస్‌: మరో ఎలిమినేషన్‌.. ఇక నో రిటర్న్‌ | Bigg Boss Elimination: Mumaith Khan is out | Sakshi
Sakshi News home page

బిగ్‌బాస్‌: మరో ఎలిమినేషన్‌.. ఇక నో రిటర్న్‌

Published Mon, Sep 4 2017 10:07 AM | Last Updated on Sun, Sep 17 2017 6:23 PM

బిగ్‌బాస్‌: మరో ఎలిమినేషన్‌.. ఇక నో రిటర్న్‌

బిగ్‌బాస్‌: మరో ఎలిమినేషన్‌.. ఇక నో రిటర్న్‌

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న బిగ్‌బాస్‌ రియాలిటీ షో విజయవంతంగా 50 ఎపిసోడ్‌లు పూర్తిచేసుకుంది. జూలై 16న ప్రారంభమైన ఈ రియాలిటీ షో సక్సెస్‌పుల్‌గా రన్‌ అవుతూ.. గత ఆదివారంతో 50 ఎపిసోడ్‌ల మైలురాయిని అధిగమించింది. ఎన్టీఆర్‌ హోస్ట్‌గా ఉండటం.. మంచి ఎంటర్‌టైన్‌మెంట్‌ అందిస్తుండటంతో మంచి టీఆర్‌పీ రేటింగ్‌లో ఈ షో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే.

14 మంది సెలబ్రిటీలతో ప్రారంభమైన బిగ్‌బాస్‌ షో నుంచి తాజాగా నటి మొమైత్‌ ఖాన్‌ ఎలిమినేట్‌ అయింది. ఈ వారం ఎలిమినేషన్‌లో జోన్‌లో నవదీప్‌, ప్రిన్స్‌, దీక్ష, అర్చన, మొమైత్‌ఖాన్‌లు ఉండగా.. నవదీప్‌, ప్రిన్స్‌ శనివారమే సేఫ్‌జోన్‌లోకి వెళ్లిపోయారు. ఇక ఆదివారం నాటి ఎపిసోడ్‌లో దీక్ష, అర్చన సేఫ్‌గా ఉన్నట్టు ప్రకటించడంతో మొమైత్‌ఖాన్‌ ఇంటిదారి పట్టింది. గతంలో ఎలిమినేట్‌ అయినప్పటికీ మరోసారి బిగ్‌బాస్‌ హౌజ్‌లో గడిపేందుకు మొమైత్‌కు అవకాశం దక్కిన సంగతి తెలిసిందే. ఈసారి మాత్రం అలాంటి రీఎంట్రీ చాన్స్‌ లేకుండా ఇంటికి వెళ్లిపోయింది మొమైత్‌. ఈ సందర్భంగా హోస్ట్‌ ఎన్టీఆర్‌ ఇచ్చిన బిగ్‌బాంబ్‌ను మొమైత్‌ హరితేజపై విసిరింది. ఈ టాస్క్ ప్రకారం హౌస్‌లో ఉన్న సభ్యులు గేమ్స్ నిబంధనలను ఉల్లంఘించినప్పుడల్లా.. హరితేజ వెళ్లి స్విమ్మింగ్‌పూల్‌లో దూకాలంటూ మొమైత్‌ ట్విస్ట్‌ ఇచ్చింది.

మొత్తానికి వినోదభరితంగా సాగుతున్న బిగ్‌బాస్‌ షోలో శనివారం నాటి ఎపిసోడ్‌లో ఎన్టీఆర్‌కు సీనియర్‌ యాంకర్‌ సుమ జతకలిసి.. షోను మరింత హుషారెత్తించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement